Yuzvendra Chahal: కాళ్లు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి రూమ్‌లో పడేసారు!

ముంబై: ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో ఓ ఆర్‌సీబీ ఆటగాడు తనను 15వ అంతస్థు నుంచి వేలాడదీసాడని సంచలన వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. తాజాగా మరో బాంబు పేల్చాడు. 2011 ఐపీఎల్ సీజన్‌తో తాను ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు అప్పటి సహచర ఆటగాళ్లు జేమ్స్ ఫ్రాంక్లిన్, ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ తనను కట్టివేశారని చెప్పాడు. వాళ్లిద్దరు తన నోటికి ప్లాస్టర్ వేసి.. గదిలో పడేసారని, ఆ విషయం మరిచిపోవడంతో తాను రాత్రంతా నరకం అనుభవించానని చాహల్ చెప్పుకొచ్చాడు.

హౌస్ కీపింగ్ బాయ్ రక్షించాడు..
'అది 2011లో ముంబై ఛాంపియన్స్ లీగ్ గెలిచినప్పుడు జరిగింది. మేమప్పుడు చెన్నైలో ఉన్నాం. సైమండ్స్ చాలా 'ఫ్రూట్ జూస్' తాగాడు. అతడేమనుకున్నాడో నాకు తెలియదు. సైమండ్స్, జేమ్స్ ఫ్రాంక్లిన్ కలిసి నా చేతులు, కాళ్లు కట్టేశారు. నువ్వే ఈ కట్లు విప్పుకోవాలి అన్నారు. నా నోటికి టేపు కూడా వేశారు. ఆ తర్వాత పార్టీలో పడి నన్ను పూర్తిగా మరిచిపోయారు. ఉదయం గదిని శుభ్రం చేయడానికి వచ్చిన వ్యక్తి నన్ను చూశాడు. మరికొందరిని పిలిచి నా కట్లు విప్పాడు. ఆ ఆటగాళ్లెప్పుడూ నాకు క్షమాపణలు చెప్పలేదు.'అని అశ్విన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చాహల్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.

ప్రైవేట్‌గా మాట్లాడుతాం..
కానీ ఆ విషయాన్ని చాహల్ అశ్విన్ ఇంటర్వ్యూలో వెల్లడించలేదని తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఆర్‌సీబీ పోడ్ కాస్ట్‌లో సైమండ్స్‌తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ చాహల్ ఈ వ్యాఖ్యలు చేసాడని అభిమానులు సాక్ష్యాధారాలతో సహా ట్వీట్ చేస్తున్నారు. 2011 నుంచి 2013 వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఫ్రాంక్లిన్ ప్రస్తుతం డర్హమ్ కౌంటీ ప్రధాన కోచ్‌గా పనిచేస్తున్నాడు.
చాహల్ ఆరోపణల నేపథ్యంలో కౌంటీ స్పందించింది. ఈ విషయంపై ఫ్రాంక్లిన్‌తో ప్రైవేటుగా మాట్లాడతామని తెలిపింది. ''2011లో జరిగిన ఘటనకు సంబంధించిన వార్తలు మా దృష్టికి వచ్చాయి. మా ఉద్యోగి పేరు కూడా అక్కడ ప్రస్తావనకు వచ్చింది. నిజాన్ని తెలుసుకోవడం కోసం అతడితో వ్యక్తిగతంగా మాట్లాడతాం'' అని డర్హమ్ ఓ ప్రకటనలో చెప్పింది.

15వ అంతస్థు నుంచి..
2013 ఐపీఎల్ సీజన్‌లో ఓ ఆర్‌సీబీ ప్లేయర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తు బాల్కానీలో వేలాడదీసాడని చాహల్ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. ఏ తప్పిదం జరిగినా తాను అక్కడి నుంచి కిందపడి ప్రాణాలు కోల్పేయేవాడినని చెప్పుకొచ్చాడు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అతని పేరు చెప్పాలని, అది సరదాగా చేసిన పని కాదని, సదరు ఆటగాడిపై తీసుకున్న చర్యలు ఏంటనే విషయం తెలియాలని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం సదరు ప్లేయర్‌ను జీవితాంతం నిషేదించాలన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications