Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది ఆ భారత బౌలర్‌ను చూసే నేర్చుకున్నా: అండర్సన్

భారత దిగ్గజ పేసర్ జహీర్‌ ఖాన్‌ను చూసే రివర్స్ స్వింగ్ బౌలింగ్ నేర్చుకున్నానని ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. 41 ఏళ్ల వయసులో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న ఈ ఇంగ్లండ్ స్టార్ పేసర్.. టెస్ట్‌ల్లో 700 వికెట్ల మైలురాయికి రెండు అడుగుల దూరంలో నిలిచాడు. ఇప్పటి వరకు 186 మ్యాచ్‌ల్లో 698 వికెట్లు తీసాడు.

భారత్‌తో ధర్మశాల వేదికగా జరిగే చివరి టెస్ట్‌లో మరో రెండు వికెట్లు తీస్తే.. టెస్ట్‌ల్లో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా చరిత్రకెక్కుతాడు. ఓవరాల్‌గా ముత్తయ్య మురళీధరణ్, దివంగత షేన్ వార్న్ తర్వాత ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా నిలుస్తాడు. ఈ క్రమంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో సినిమాతో మాట్లాడిన అండర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 James Anderson says Zaheer Khan was someone I used to watch a lot to try and learn from

జహీర్ ఖాన్ చూసి నేర్చుకున్నా..:
'జహీర్ ఖాన్ బౌలింగ్‌ను తరుచుగా చూడటంతో పాటు అతనిని అనుకరిస్తూ నేర్చుకునే ప్రయత్నం చేసేవాడిని. ముఖ్యంగా రివర్స్ స్వింగ్ ఎలా చేస్తున్నాడు. పరుగెత్తేటప్పుడు బంతిని ఎలా కవర్ చేస్తున్నాడనే విషయాలను బాగా పరిశీలించేవాడిని. భారత్‌లో అతనికి వ్యతిరేకంగా చాలా సార్లు ఆడాను. ఆ సమయంలో రివర్స్ స్వింగ్ నేర్చుకునే ప్రయత్నం చేశాను.'అని అండర్సన్ గుర్తు చేసుకున్నాడు.

భారత దిగ్గజ పేస్ బౌలర్ అయిన జహీర్ ఖాన్ 2014లో తన టెస్ట్ కెరీర్‌ను ముగించగా.. ఆ సమయంలో అండర్సన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత జట్టులో రివర్స్ స్వింగ్‌ను సమర్థవంతంగా రాబట్టే నైపుణ్యం జస్‌ప్రీత్ బుమ్రాకు ఉందని అండర్సన్ కొనియాడాడు. రెండో టెస్ట్‌లో బుమ్రా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపించాడు.

బుమ్రా.. రివర్స్ స్వింగ్ మాస్టర్:
'నైపుణ్యం కలిగిన బౌలర్‌ నుంచి ఎవరైనా అసాధారణ ప్రదర్శనను ఆశిస్తాం. భారత్‌లో రివర్స్ స్వింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయంలో బుమ్రా ఎక్స్‌పర్ట్. అతనికి మంచి పేస్‌ ఉంది. అంతేకాకుండా కచ్చితత్వంతో పాటు నిలకడగా బౌలింగ్ చేయగలడు. రెండో టెస్ట్‌లో ఓలిపోప్‌కు వేసిన యార్కరే బుమ్రా ఏంటో తెలియజేస్తోంది.

అతను అతి త్వరలోనే నెంబర్ వన్ బౌలర్‌గా నిలుస్తాడు. బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్. అతని మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనను చూసి మేం ఏం ఆశ్చర్యపోలేదు. అతను నుంచి మేం ఇలాంటి ప్రదర్శనను ముందే ఊహించాం. బుమ్రా, షమీ, సిరాజ్ కంటే మెరుగైన బౌలర్లు లేరు. వారు వరల్డ్ క్లాస్ పేసర్లు. ఇషాంత్ శర్మ కూడా ఈ జాబితాలో ఉంటాడు. అందుకే భారత పేస్ అటాక్ బలంగా ఉంది.'అని అండర్సన్ చెప్పుకొచ్చాడు.

ఆ ఆటగాళ్లు పుట్టలేదు..:
జేమ్స్ అండర్సన్ అరంగేట్రం చేసే సమయానికి ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో ఉన్న షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ జన్మించలేదు. 2002లో టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేసిన అండర్సన్.. 22 ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. అయితే తాను 41 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తిగా ఏ మాత్రం ఫీలవ్వడం లేదని, చాలా యంగ్‌గా ఉన్నట్లు అనిపిస్తుందని అండర్సన్ చెప్పుకొచ్చాడు.

ఫిట్‌నెస్ విషయంలో తాను కుర్రాళ్లతో పోటీపడగలనన్నాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ లేకపోవడం నిరాశకు గురిచేసిందని, అత్యుత్తమ ఆటగాళ్లతో ఆడితేనే అసలు మజా ఉంటుందన్నాడు.

Story first published: Wednesday, February 28, 2024, 18:26 [IST]
Other articles published on Feb 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+