Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

James Anderson: అందుకే భారత్ మాపై ఆధిపత్యం చెలాయించింది!

James Anderson reveals why India is 2-1 ahead in the Test series

న్యూఢిల్లీ : ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్‌.. ఇంగ్లండ్‌ కంటే గొప్పగా ఆడిందని ఆ జట్టు సీనియర్‌ బౌలర్‌ జేమ్స్ అండర్సన్‌ అన్నాడు. కీలక సమయాల్లో ఇంగ్లండ్‌ చేతులెత్తేయడంతో భారత్ 2-1తో ఆధిక్యం సాధించిందని ఈ స్టార్ పేసర్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అండర్సన్.. 15 వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య జరిగిన ఫస్ట్ టెస్ట్ వర్షం కారణంగా డ్రా అవ్వగా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. లీడ్స్‌లో ఇంగ్లండ్ దుమ్మురేపగా.. ఓవల్‌లో 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించితూ కోహ్లీ అద్భుతం చేసింది. ఫలితంగా సిరీస్ విజయానికి చేరువైంది.

కానీ మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆఖరి టెస్ట్ అనూహ్య పరిస్థితుల్లో రద్దయింది. భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఈ మ్యాచ్‌ను రద్దు చేశాయి. భవిష్యత్తులో వీలు చూసుకొని ఈ మ్యాచ్‌కు ఏర్పాట్లు చేయనున్నాయి. అయితే టెలిగ్రాఫ్‌కు రాసిన కథనంలో అండర్సన్.. సిరీస్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించడానికి గల కారణాన్ని రాసుకొచ్చాడు.

కీలక సమయాల్లో రాణించడంతో..

కీలక సమయాల్లో రాణించడంతో..

'ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకుంది. ముఖ్యంగా, లార్డ్స్‌, ఓవల్‌లో జరిగిన టెస్టుల్లో ఇంగ్లండ్‌ రాణించలేకపోయింది. నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మేం 99 పరుగుల ఆధిక్యం సాధించాం. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మా బౌలర్లు విఫలం కావడంతో భారత్‌ భారీ ఆధిక్యం సాధించింది. అనంతరం భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇంగ్లండ్‌ వెంట వెంటనే వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా, బుమ్రా రివర్స్ స్వింగ్‌తో గొప్పగా రాణించాడు' అని అండర్సన్‌ అన్నాడు.

 ఇరు బోర్డుల అంగీకారంతో

ఇరు బోర్డుల అంగీకారంతో

చివరి టెస్ట్ రద్దు చేయడంపై బీసీసీఐ సెక్రటరీ జై షా మాట్లాడుతూ... 'భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరియు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా ఈ రోజు మాంచెస్టర్‌లో ప్రారంభం కానున్న 5వ టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించాయి. భారత బృందంలో కరోనా కేసుల నేపథ్యంలో ఇరు బోర్డులూ పలుమార్లు చర్చలు జరిపాయి. తొలుత ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని భావించాం. అయితే ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో చర్చల అనంతరం రద్దు చేయడానికి ఏకాభిప్రాయానికి వచ్చాం. ఇరు బోర్డుల మధ్య మంచి బంధం ఉంది. కష్టసమయాల్లో మా పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించినందుకు ఈసీబీకి ధన్యవాదాలు. ఈ టెస్ట్ మ్యాచ్‌ని రీషెడ్యూల్ చేయడానికి ఒక విండోను కనుగొంటాం' అని తెలిపాడు.

నిరాశలో అభిమానులు..

నిరాశలో అభిమానులు..

మరోవైపు ఫైనల్‌ మ్యాచ్‌ రద్దవ్వడంపై పలువురు మాజీలు, క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సామాజిక మాధ్యమాల్లో అసహనం వ్యక్తం చేశారు. భారత్ ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్నందున చివరి మ్యాచ్‌లోనూ గెలిచి ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇది వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా జ‌రుగుతున్న సిరీస్ కాబట్టి ఫైనల్ మ్యాచ్ ఆడితే బాగుందని కొందరు అంటున్నారు. ఇక టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా జ‌రుగుతున్న సిరీస్ కాబట్టి ఐసీసీ రూల్స్ ప్ర‌కారం.. ఓ టీమ్‌లో కొవిడ్ కేసు బ‌య‌ట‌ప‌డితే మ్యాచ్‌ను ర‌ద్దు చేయ‌వ‌చ్చు.

 ఈసీబీ గందరగోళమైన ప్రకటన

ఈసీబీ గందరగోళమైన ప్రకటన

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌ రద్దుపై తొలుత ఇంగ్లండ్ అండ్ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) గందరగోళమైన ప్రకటన చేసింది. ఈ టెస్టులో టీమిండియా తమ తుది జట్టును బరిలోకి దింపలేకపోతున్నందున మ్యాచ్‌ను కోల్పోయిందని పేర్కొంది. తర్వాత ఈ వ్యాఖ్యలను సరిచేసుకొని ఐదో టెస్టు రద్దయినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ప్రకటనతో పూర్తి స్పష్టత వచ్చింది. ఇక భారత జట్టుకు ఈ ఏడాదంతా బిజీ షెడ్యూల్ ఉంది. వ‌చ్చే ఏడాది టీ20, వ‌న్డే సిరీస్ కోసం టీమిండియా మ‌ళ్లీ ఇంగ్లండ్ వ‌స్తోంది. మ‌రి అప్పుడు ఈ టెస్ట్ ఏమైనా ఆడ‌తారా అన్న‌ది చూడాలి.

2022లో 3టీ20లు.. 3 వన్డేలు..

2022లో 3టీ20లు.. 3 వన్డేలు..

వచ్చే సంవత్సరం జూలైలో భారత జట్టు ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుందని ఈసీబీ బుధవారం వెల్లడించింది. 2022లో స్వదేశంలో ఇంగ్లండ్‌ జట్టు ఆడే సిరీసుల వివరాలు ప్రకటించిన సందర్భంగా ఈ విషయం తెలిపింది. కరోనా కారణంగా సుదీర్ఘ పర్యటనలు నివారించే ఉద్దేశంతో గతంలో మాదిరి కాకుండా భారత జట్టు టెస్ట్‌లు, పరిమిత ఓవర్ల సిరీసులను విడివిడిగా నిర్వహిస్తున్నారు.

జూలై ఒకటిన ఓల్డ్‌ట్రాఫర్డ్‌లో జరిగే మ్యాచ్‌తో టీ20 సిరీస్‌ మొదలుకానుంది. తదుపరి రెండు మ్యాచ్‌లు ట్రెంట్‌బ్రిడ్జ్‌ (జూలై 3), ఏజెస్‌ బౌల్‌ (జూలై 6)లో జరుగుతాయి. 3వన్డేలను ఎడ్జ్‌బాస్టన్‌ (జూలై 9), ఓవల్‌ (జూలై 12), లార్డ్స్‌ (జూలై 14)లో నిర్వహిస్తారు.

Story first published: Saturday, September 11, 2021, 8:13 [IST]
Other articles published on Sep 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+