న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో టెస్ట్‌కు ఆర్చర్, అండర్సన్ ఆగయా!

James Anderson And Jofra Archer Return As England Announce Squad For The Third Test Against West Indies

మాంచెస్టర్‌: 'బయో సెక్యూర్‌' నిబంధనలను ఉల్లంఘించి వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు దూరమైన ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ తిరిగి మూడో టెస్ట్‌కు ఎంపికయ్యాడు. ఐదు రోజు ఐసోలేషన్‌ను పూర్తి చేసుకున్న అతనికి రెండు సార్లు కరోనా టెస్ట్ నిర్వహించగా నెగటీవ్ రావడంతో మూడో టెస్ట్‌కు అందుబాటులోకి వచ్చిన ఆర్చర్.. గురువారం ప్రకటించిన 14 మంది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్‌తో పాటు రెండో టెస్ట్‌కు విశ్రాంతి పేరిట దూరమైన జేమ్స్ అండర్సన్ కూడా జట్టులోకి వచ్చాడు.

శుక్రవారం నుంచి ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఇక మ్యాచ్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ ఈ 14 మంది జాబితా నుంచి 11 మంది సభ్యులను తుది జట్టును ఎంపిక చేయనుంది. అయితే తొలి టెస్ట్‌లో కీలకంగా వ్యవహరించిన ఆర్చర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు చెరొక విజయంతో 1-1తో సమంగా నిలిచాయి. సిరీస్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

ఇక తప్పు చేసానని అంగీకరించినా తనపై తీవ్ర విమర్శలు చేయడం, ప్రపంచం ముందు ఓ పెద్ద నేరగాడిగా నిలబెట్టడం తనను తీవ్రంగా బాధించిందని ఆర్చర్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ఐదు రోజుల ఐసోలేషన్ తనకు ఓ నరకంలా అనిపించిదన్నాడు. మూడో టెస్ట్ బరిలోకి దిగేందుకు ఆతృతగా ఉందని, సిరీస్ గెలిచే సత్తా తమ జట్టుకు ఉందన్నాడు.

ఇంగ్లండ్‌ టీమ్‌:

జో రూట్‌(కెప్టెన్‌), జేమ్స్‌ ఆండర్సన్‌, జోఫ్రా ఆర్చర్‌, డొమినిక్‌ బెస్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, రోర్నీ బర్స్న్‌, జోస్‌ బట్లర్‌, జాక్‌ క్రాలీ, శామ్‌ కర్రన్‌, ఓలీ పోప్‌, డామ్‌ సిబ్లే, బెన్‌స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌

రేసింగ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలనుంది: పోర్న్‌ స్టార్‌గా మారిన మహిళా రేసర్‌!రేసింగ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలనుంది: పోర్న్‌ స్టార్‌గా మారిన మహిళా రేసర్‌!

Story first published: Thursday, July 23, 2020, 20:42 [IST]
Other articles published on Jul 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X