Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓయ్ జైస్వాల్.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? మందలించిన రోహిత్!(వీడియో)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సహనం కోల్పోయాడు. ఫీల్డింగ్‌లో తప్పిదం చేసిన సహచర ఆటగాడైన యశస్వి జైస్వాల్‌ను తనదైన శైలిలో మందలించాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లో టీమిండియా టాస్ ఓడి ఫీల్డింగ్‌కు దిగిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌‌లో ఆసీస్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ముఖ్యంగా ఆ జట్టు అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆ జట్టు భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు రోహిత్ శర్మ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఫీల్డ్ సెటప్‌తో బౌలర్లను మారుస్తూ.. ఫలితం రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

Jaiswal are you playing gully cricket - Rohit Sharma scolds Yashasvi Jaiswal at MCG Video

జిడ్డుగా ఆడుతున్న మార్నస్ లబుషేన్‌ను కట్టడి చేసేందుకు రోహిత్.. సిల్లీ పాయింట్‌లో ఫీల్డర్‌ను పెట్టి స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాడు. ఈ పొజిషన్‌లో యశస్వి జైస్వాల్‌ను పెట్టగా.. అతను పదే పదే జంప్ చేశారు. లబుషేన్ ఆడకముందే జంప్ చేస్తుండటంతో రోహిత్ ఆగ్రహానికి గురయ్యాడు. 'ఓయ్ జైస్వాల్.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? అతను బాల్ ఆడకముందే జంప్ చేస్తున్నావ్? అలా చేయకు'అని హిందీలో మందలించాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అవ్వగా.. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సామ్ కోన్‌స్టాస్ శుభారంభంతో ఆసీస్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. సామ్ కోన్‌స్టాస్‌తో పాటు ఉస్మాన్ ఖవాజ(57), మార్నస్ లబుషేన్(72), స్టీవ్ స్మిత్(56 బ్యాటింగ్) ఆసీస్ టాప్-4 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ట్రావిస్ హెడ్(0), మిచెల్ మార్ష్(4) విఫలమైనా.. అలెక్స్ క్యారీతో కలిసి స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. బుమ్రా మూడు వికెట్లు తీగాయ.. జడేజా, సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, December 26, 2024, 11:47 [IST]
Other articles published on Dec 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+