న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచంలో మూడోది.. దేశంలో రెండోది.. జైపూర్‌లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం

Jaipur to get world’s 3rd largest cricket stadium

జైపూర్‌: భారత్‌లో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రంగం సిద్దమైంది. జైపూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని చోన్ప్‌ గ్రామంలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో రూ. 350 కోట్ల అంచనా వ్యయంతో స్టేడియంను నిర్మించేందుకు రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (ఆర్‌సీఏ) తీర్మానించింది.

75 వేల సీటింగ్‌ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ స్టేడియంలో రెండు ప్రాక్టీస్‌ గ్రౌండ్లు, 30 ప్రాక్టీస్‌ నెట్స్‌, 4 వేల వాహనాలకు పార్కింగ్‌తో పాటు ఒక క్లబ్‌ హౌస్‌, రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తామని ఆర్‌సీఏ ప్రెసిడెంట్ వైభవ్ గెహ్లాట్ తెలిపారు. స్డేడియాన్ని రెండో దశల్లో నిర్మిస్తామన్నారు. తొలి ఫేస్‌లో 45 వేల సీటింగ్ కెపాసిటీతో పూర్తి చేస్తామని, రెండో దశలో పూర్తిస్థాయి 75 వేల సీటింగ్ కెపాసిటీని పూర్తి చేస్తామన్నారు.

నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు లభించాయని, రెండేళ్లలో స్టేడియాన్ని సిద్ధం చేస్తామన్నారు. 1.10 లక్షల కెపాసిటీతో ఈ మధ్య నిర్మితమైన అహ్మదాబాద్‌లోని మొతేరా అతి పెద్దది కాగా.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ (లక్షా రెండు వేల సీటింగ్‌) తర్వాతి స్థానంతో ఉంది. జైపూర్‌లో కట్టబోయేది మూడో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా నిలవనుంది.

సునీల్ గవాస్కర్ చెత్త బ్యాట్స్‌మెన్.. కిరణ్ మోరే సంచలన వ్యాఖ్యలు!!సునీల్ గవాస్కర్ చెత్త బ్యాట్స్‌మెన్.. కిరణ్ మోరే సంచలన వ్యాఖ్యలు!!

Story first published: Sunday, July 5, 2020, 9:59 [IST]
Other articles published on Jul 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X