Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ సూపర్ క్యాచ్.. లబుషేన్ ఔట్, ఆ వెంటనే స్టార్క్ కూడా

India Vs Australia,3rd ODI: Kohli Stunning Catch | Jadeja Out's Labuschagne & Starc In Same Over!
Jadeja gets Labuschagne, Starc in same over to dent Australia

బెంగళూరు : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 32 ఓవర్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లబుషేన్(54), ఆ వెంటనే మిచెల్ స్టార్క్(0) వరుసగా ఔటయ్యారు. ఈ ఓవర్ మూడో బంతిని లబుషేన్ కవర్ డ్రైవ్ షాట్ ఆడగా... ఫార్వార్డ్ ఫీల్డర్ గా ఉన్న కోహ్లీ అద్భుత డైవ్‌తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. దీంతో లుబషేన్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ముగిసింది.

ఆ వెంటనే అనూహ్యంగా క్రీజలోకి వచ్చిన మిచెల్ స్టార్క్ రెండు బంతులు ఎదుర్కొని.. చివరి బంతికి చహల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ 173 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓవైపు వరుస వికెట్లు కోల్పోతున్నా.. మరోవైపు స్మిత్(84 బ్యాటింగ్ ) సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(21బ్యాటింగ్) క్రీజులోకి వచ్చాడు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(3), ఆరోన్ ఫించ్(19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన స్మిత్, లబుషేన్ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. తొలుత 63 బంతుల్లో 8 ఫోర్లతో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... అనంతరం 60 బంతుల్లో 5 ఫోర్లతో లబుషేన్ అర్థ శతకం సాధించాడు. స్మిత్‌కు ఇది 25వ హాఫ్ సెంచరీ కాగా.. లబుషేన్‌కు మాత్రం కెరీర్‌లో ఫస్ట్ హాఫ్ సెంచరీ.

అయితే హాఫ్ సెంచరీ అనంతరం లబుషేన్ కోహ్లీ సూపర్ క్యాచ్‌కు వెనుదిరగడంతో మూడో వికెట్‌కు నమోదైన 127 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ సిరీస్‌లోని తొలి వన్డేతోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన లబుషేన్..తన ఫామ్‌ను కొనసాగించాడు. తొలి వన్డేలో బ్యాటింగ్ అవకాశం రాకపోగా.. రెండో వన్డేలో 47 పరుగులతో తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్లిష్ట స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చి విలువైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నాడు. ప్రస్తుతం 37.3 ఓవర్లలో ఆసీస్ స్కోర్ 207/4.

Story first published: Sunday, January 19, 2020, 16:28 [IST]
Other articles published on Jan 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+