Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమ్మతోడు ఆఫ్ ది ఫీల్డ్ కోహ్లీ వేరు.. ఆ శబ్దాన్ని ఎప్పుడూ వినలేదు: జాకబ్ బెతెల్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ యువ ప్లేయర్ జాకబ్ బెతెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. మైదానం బయట కోహ్లీ చాలా ప్రశాంతంగా, సరదాగా ఉంటాడని చెప్పాడు. మైదానంలో ఉండే కోహ్లీకి, బయటే ఉండే అతనికి చాలా తేడా ఉందని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న జాకబ్ బెతెల్.. కోహ్లీతో కలిసి కొన్ని మ్యాచ్‌లు ఓపెనింగ్ చేశాడు. ఆర్‌సీబీ తరఫున తాను ఆడిన తొలి మ్యాచ్‌లో బౌండరీ కొట్టగానే వచ్చిన శబ్దాన్ని తన జీవితంలోనే ఎప్పుడూ వినలేదని తెలిపాడు. తాజాగా భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో జాకబ్ బెతెల్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ హీరో రోహిత్‌ను ఔట్ చేసి భారత్ పతనాన్ని శాసించాడు.

Jacob Bethell Says Off The Field Virat Kohli Is Very Chilled Never Heard A Sound That Loud

కోహ్లీతో గడపడం భలే ఉంటుంది..

తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాకబ్ బెతెల్.. కోహ్లీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ' మైదానం బయట కోహ్లీ చాలా ప్రశాంతంగా, సరదాగా ఉంటాడు. ఆ సమయంలో అతనితో గడపడం చాలా బాగుంటుంది. కానీ మైదానంలోకి దిగినా.. ప్రాక్టీస్ సమయంలోనైనా కోహ్లీ అత్యంత పోటీతత్వంతో కనిపిస్తాడు.

IND vs ENG: బుమ్రా లేకుంటే.. అంతా ఉత్తదే!

IND vs ENG: బుమ్రా లేకుంటే.. అంతా ఉత్తదే!

కోహ్లీ లైఫ్ స్టైల్ అంతా అత్యుత్త ప్రతిభను ప్రదర్శించే దిశగానే సాగుతుంది. అతను తీవ్రమైన పోటీతత్వం కలిగిన వ్యక్తి. ఆర్‌సీబీకి అతను కెప్టెన్ కాకపోయినా.. ఒక గొప్ప సారథిగా వ్యవహరించేవాడు.

అది మైండ్ బ్లోయింగ్ అనుభవం..

మైదానంలో కోహ్లీ చాలా ఉత్సాహంగా.. భావోద్వేగంగా కనిపిస్తాడు. కానీ టీమ్ మీటింగ్స్‌లో అతను చెప్పే విషయాలు నమ్మశక్యం కానీ రీతిలో ఉంటాయి. అలాంటి వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు.. ఆ సమాచారాన్నంతటినీ గ్రహించాలనే అనుకుంటాం.

కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేయడం మైండ్ బ్లోయింగ్ అనుభవం. ఈ మ్యాచ్‌కు ముందు నేను చాలా కంగారు పడ్డాను. సొంత అభిమానుల మధ్య అది నాకు తొలి మ్యాచ్. నా ఆందోళనను మాటల్లో చెప్పలేను. కానీ మైదానంలోకి అడుగుపెట్టగానే ఒక రకమైన ఉత్సాహం నన్ను ఆవహించింది.

నాపై ఒత్తిడి చేస్తే క్రికెట్ నుంచి తప్పుకుంటా: విరాట్ కోహ్లీ (వీడియో)

నాపై ఒత్తిడి చేస్తే క్రికెట్ నుంచి తప్పుకుంటా: విరాట్ కోహ్లీ (వీడియో)

ఆ శబ్దాన్ని నా జీవితంలో ఎప్పుడూ వినలేదు..

ఆ టోర్నీలో చాలా మ్యాచ్‌లకు నేను డ్రింక్స్ అందించాను. అక్కడి వాతావరణం, ప్రేక్షకుల మద్దతు చూసి మ్యాచ్ ఆడాలనే కోరిక కలిగింది. కోహ్లీతో బ్యాటింగ్‌కు దిగినప్పుడు స్టేడియం అంతా హోరెత్తిపోయింది. అసలు నా ఆలోచనలు కూడా నాకు వినిపించనంత శబ్దంతో మారుమోగింది.

ఎక్కడా ఖాళీలేదు. ప్రేక్షకులంతా మా పైనే ఉన్నట్లు అనిపించింది. అదృష్టవశాత్తు ఆ మ్యాచ్‌లో మేం కొన్ని పరుగులు చేయగలిగాం. నాతో పాటు కోహ్లీ కూడా కొన్ని పరుగులు చేశాడు. నేను ఎదుర్కొన్న రెండో బంతినే బౌండరీ బాదినప్పుడు వచ్చిన శబ్దాన్ని నా జీవితంలో ఎప్పుడూ వినలేదు.'అని జాకోబ్ బెతెల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, July 22, 2026, 11:36 [IST]
Other articles published on Jul 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+