Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: కొంపముంచిన రవి బిష్ణోయ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన టీమిండియా!

ఇంగ్లండ్‌ పర్యటనను కూడా టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్ఫణం కాగా.. రెండో టీ20లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. రవి బిష్ణోయ్ చెత్త బౌలింగ్‌ టీమిండియా పతనాన్ని శాసించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(24 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 43), ఇషాన్ కిషన్(40 బంతుల్లో 6 ఫోర్లతో 49) టాప్ స్కోరర్లుగా నిలవగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37), తిలక్ వర్మ(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరణ్(3/33) మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, లియామ్ డాసన్ తలో వికెట్ తీసారు.

Jacob Bethell 76 and Ravi Bishnoi s Costly Spell Cost India Victory as England Chase Down 191 in 2nd T20I

జాకోబ్ బెతెల్ విధ్వంసం..

అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 191 పరుగులు చేసి గెలుపొందింది. జాకోబ్ బెతెల్(46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్(15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39), టామ్ బాంటన్(32 బంతుల్లో 6 ఫోర్లతో 39) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/40) మూడు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

IND vs ENG: నిరాశపర్చిన వైభవ్.. కొంపముంచిన ఇషాన్ జిడ్డు బ్యాటింగ్!

IND vs ENG: నిరాశపర్చిన వైభవ్.. కొంపముంచిన ఇషాన్ జిడ్డు బ్యాటింగ్!

శుభారంభం దక్కినా..

191 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్లు ఫిల్ సాల్ట్(0), జోస్ బట్లర్(0) డకౌట్‌గా వెనుదిరిగారు. దాంతో ఇంగ్లండ్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ దూకుడుగా ఆడి జట్టును ఆదుకున్నాడు. భారీషాట్లతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్‌ లయలోకి వచ్చింది. అయితే హాఫ్ సెంచరీ దిశగా సాగిన హ్యారీ బ్రూక్(39)‌ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. టామ్ బాంటన్, జాకోబ్ బెతెల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. 67 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అర్ష్‌దీప్ సింగ్ విడదీసాడు. టామ్ బాంటన్‌(39)ను క్యాచ్ ఔట్‌గా పెలివియన్ చేర్చాడు. విల్ జాక్స్‌(9)ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన సామ్ కరణ్‌తో కలిసి జాకోబ్ బెతెల్ చెలరేగాడు.

IND vs ENG 2nd T20I: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. సంజూపై వేటు!

IND vs ENG 2nd T20I: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. సంజూపై వేటు!

కొంపముంచిన రవి బిష్ణోయ్..

ముఖ్యంగా రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్‌లో మూడు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 29 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌లో రవి బిష్ణోయ్ రెండు నోబాల్స్ వేయడం బెతెల్‌కు కలిసి వచ్చింది. ఈ క్రమంలో అతను 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ మూమెంటమ్ మొత్తాన్ని మార్చేసింది. ఈ ఓవర్‌ను రవి బిష్ణోయ్ కట్టడిగా వేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. హర్షిత్ రాణా వేసిన 18వ ఓవర్‌లో 8 పరుగులు.. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్‌లో 10 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.

Story first published: Saturday, July 4, 2026, 22:50 [IST]
Other articles published on Jul 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+