Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రో అది ఆసియా కప్ 2025.. ఫ్యాషన్ షో కాదు! హార్దిక్ న్యూ లుక్‌పై పేలుతున్న సెటైర్స్!

ఆసియా కప్ 2025 టోర్నీ ప్రారంభానికి ముందే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వార్తల్లో నిలిచాడు. న్యూ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. కొత్త హెయిర్‌ స్టైల్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. 'నేను కొత్తగా'అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలను షేర్ చేశాడు. ఆసియా కప్ 2025 కోసం గురువారం దుబాయ్ బయల్దేరిన తర్వాత ఈ ఫొటోలను హార్దిక్ పాండ్యా పంచుకున్నాడు.

తన జట్టును చిన్నగా కత్తిరించుకున్న హార్దిక్ పాండ్యా.. దానికి sandy blonde కలర్ వేయించుకున్నాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

It s Asia Cup 2025 Not a Fashion Show Fans Troll Hardik Pandya Over New Look

ఈ నయా హెయిర్‌ స్టైల్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్‌ను తలపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం హార్దిక్ పాండ్యాను మందలిస్తున్నారు. ఆసియా కప్ 2025 ఆడేందుకు వెళ్తున్నావని, ఫ్యాషన్ షోకు కాదని సెటైర్లు పేల్చుతున్నారు. హార్దిక్ పాండ్యా తరహాలోనే శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ sandy blonde కలర్ వేసుకున్నారనే ఫొటోలను షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకొని ఆటపై ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు.

బ్రిటీష్ గాయని, టీవీ నటి అయిన జాస్మిన్ వాలియాను ఇంప్రెస్ చేసేందుకే హార్దిక్ తన లుక్‌ను మార్చాడని మరికొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్‌ను వదిలేసిన హార్దిక్ పాండ్యా.. జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అంతేకాకుండా హార్దిక్ ఆడే మ్యాచ్‌లకు జాస్మిన్ హాజరవ్వడం ఈ వార్తలకు బలం చేకూరింది. ఇటీవల ఈ ఇద్దరూ ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసుకోవడంతో బ్రేకప్ చేసుకున్నారనే పుకార్లు కూడా వచ్చాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 టోర్నీ ప్రారంభం కానుండటంతో భారత జట్టు గురువారం యూఏఈకి బయలుదేరింది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14 దాయాదీ పాకిస్థాన్‌తో తలపడనుంది.

Story first published: Friday, September 5, 2025, 13:14 [IST]
Other articles published on Sep 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+