Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంతకు తెగించార్రా! కోహ్లీకి బర్త్‌డే విషెస్ చెప్పిన మహిళా ఫుట్‌బాలర్‌పై ట్రోలింగ్!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేడు(నవంబర్ 5) 36వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీకి అభిమానులు, మాజీ, సహచర క్రికెటర్లు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. కెరీర్‌లో కోహ్లీ మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. అతనికి సంబంధించిన చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లను గుర్తు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఇటలీ మహిళా ఫుట్‌బాలర్ అగటా ఇసాబెల్లా సెంటాస్సో ఎక్స్‌వేదికగా విరాట్ కోహ్లీకి బర్త్‌డే విషెస్ తెలియజేసింది. విరాట్ కోహ్లీని ట్యాగ్ చేస్తూ..'హ్యాపీ బర్త్‌డే.. ఆల్‌ ది బెస్ట్.. నీ ఇటలీ అభిమాని'అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు ఇండియా జెర్సీ ధరించిన తన ఫొటోను జత చేసింది. అయితే ఈ పోస్ట్‌పై భారత అభిమానులు విమర్శలు గుప్పించారు. 'క్రికెట్, కోహ్లీ గురించి ఏమాత్రం తెలియని నువ్వు.. లైక్స్, పాపులారిటీ కోసం ఈ పోస్ట్‌లు పెడుతున్నావ్. బాగుంది'అంటూ విమర్శలు గుప్పించారు. మరికొందరు జుగుప్సాకరమైన రీతిలో ట్రోల్ చేశారు.

Italian Footballer Trolled For Wishing Virat Kohli On Birthday Hits Back With Brutal Reply

ఈ ట్రోలింగ్‌కు అగటా ఇసాబెల్లా తనదైన శైలిలో బదులిచ్చింది. విరాట్ కోహ్లీ గురించి పోస్ట్ చేసిన ప్రతీసారి.. కొందరు నెగటివిటీని తీసుకొస్తారని అసహనం వ్యక్తం చేసింది. 'విరాట్ కోహ్లీ, క్రికెట్ గురించి పోస్ట్ చేసిన ప్రతీ సారి కొంతమంది విమర్శలు చేస్తుంటారు. నిజంగా ఇలా ఎందుకు చేస్తారో అర్థం కావడం లేదు. నమస్తే'అని ట్వీట్ చేసింది.

విరాట్ కోహ్లీ అంటే నచ్చని ఓ వర్గం ఉదయం నుంచి అతనికి వ్యతిరేకంగా ట్విటర్ వేదికగా ట్రోలింగ్‌ చేస్తోంది. విరాట్ కోహ్లీ అభిమానులను రెచ్చగొట్టేలా 'CHOKLI BLACK DAY'అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేసారు. రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌మని చెప్పుకుంటున్న కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా కింగ్ కోహ్లీని టార్గెట్ చేస్తూ ఉదయం నుంచి పోస్ట్‌లు పెట్టారు. ఆర్‌సీబీ ఇంకా ఐపీఎల్ టైటిల్ గెలవలేదనే విషయాన్ని ప్రస్తావిస్తూ సెటైర్లు పేల్చారు.

మహిళల టీమ్ మాత్రమే విజేతగా నిలవడంతో.. కోహ్లీకి చీరకట్టిన మార్ఫింగ్ ఫొటోలను షేర్ చేశారు. ధోనీ ముందు కోహ్లీ పిల్ల బచ్చా అని కామెంట్ చేశారు. ఈ ట్రోలింగ్‌ను కోహ్లీ అభిమానులు తిప్పికొట్టారు.ఇటలీ మహిళా ఫుట్‌బాలర్ అగటా ఇసాబెల్లాకు కూడా కోహ్లీ ఫ్యాన్స్ అండగా నిలిచారు.

Story first published: Tuesday, November 5, 2024, 17:30 [IST]
Other articles published on Nov 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+