Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: ఎల్లుండే భారత్ X పాక్ మ్యాచ్.. ఫ్రీగా ఎలా చూడాలంటే?

అండర్ 19 ప్రపంచకప్ 2026లో అసలు సిసలు పోరుకు రంగం సిద్దమైంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. ఆదివారం(ఫిబ్రవరి 1) జింబాబ్వేలోని బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానం వేదికగా జరిగే తమ ఆఖరి సూపర్-సిక్స్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత యువ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదుండగా.. పాకిస్థాన్ మూడింటి‌లో రెండు గెలిచింది. ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో పాక్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో భారత కుర్రాళ్లు జట్టు ఉంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని.. పాక్ పేసర్లు కవ్వించగా.. అతను అదే రీతిలో బదులిచ్చాడు. అయితే ఈ సారి తన బ్యాట్‌తో వారికి సమాధానం చెప్పాలనుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే అధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఫ్రీగా ఎలా చూడాలంటే..?

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. 12.30 గంటలకు టాస్ పడనుంది. ఈ మెగా టోర్నీకి స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియో హాట్‌స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి.అయితే ఈ వేదికల్లో మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. అయితే ప్రత్యేకమైన మొబైల్ రిఛార్జ్ ప్లాన్స్‌తో ఫ్రీగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. తద్వారా ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు.

How to Watch India vs Pakistan U19 World Cup 2026 Match for Free

కీలక ప్లేయర్లు..

భారత జట్టులో వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుష్ మాత్రే, విహాన్ మల్హోత్రా, హార్దిక్ రాజ్, అభిజ్ఞాన్ కుండు ఆటగాళ్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. విహాన్ మల్హోత్రా జింబాబ్వేపై అజేయ శతకంతో చెలరేగగా.. సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీలతో అదిరిపోయే ఆరంభాలను అందిస్తున్నాడు. పాకిస్థాన్ జట్టులో షాజైబ్ ఖాన్, సాద్ బేగ్, ఉబైద్ షాలు రాణిస్తున్నారు.

పిచ్ రిపోర్ట్ :

బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే ఉదయం పేసర్లకు కొంత స్వింగ్ లభించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 280+ పరుగులు చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు.

భారత అండర్-19 జట్టు:

ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, సి.ఆండ్రీ సిద్ధార్థ్, సాహిల్ పరాఖ్, నిఖిల్ కుమార్, అభిజ్ఞాన్ కుండు (కీపర్), హార్దిక్ రాజ్, కె.పి. కార్తికేయ, సమర్థ్ నగరాజ్, కిరణ్ చోర్మలే, నమన్ తివారీ, ప్రియాంషు మోలియా, మురుగన్ అభిషేక్, ధనుష్ గౌడ.

పాకిస్థాన్ అండర్-19 జట్టు:

సాద్ బేగ్ (కెప్టెన్/కీపర్), షాజైబ్ ఖాన్, అజాన్ అవేైస్, షామ్ల్ హుస్సేన్, అరాఫత్ మిన్హాస్, అమీర్ హసన్, ఉబైద్ షా, మహ్మద్ జైషాన్, అలీ అస్ఫాండ్, నవీద్ అహ్మద్ ఖాన్, హారూన్ అర్షద్, అహ్మద్ హసన్, ఖుబైబ్ ఖలీల్, ముహమ్మద్ రియాజుల్లా.

Story first published: Thursday, January 29, 2026, 17:08 [IST]
Other articles published on Jan 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+