For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND VS ENG 5th Test: ఐదో టెస్టుపై వచ్చిన స్పష్టత.. బీసీసీఐ సెక్రటరీ ఏం చెప్పాడంటే?

Its a BCCI and ECB joint decision: Jay Shah react about 5th Test called off

మాంచెస్ట‌ర్‌: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా మాంచెస్ట‌ర్‌ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్‌ సమయానికి మూడు గంటల ముందు ర‌ద్దైన సంగతి తెలిసిందే. ఇండియ‌న్ క్యాంప్‌లో క‌రోనా వైరస్ మహమ్మారి క‌ల‌క‌లం రేప‌డంతో మ్యాచ్ ర‌ద్ద‌యింది.

అయితే మ్యాచ్ రద్దు విషయంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) చేసిన ఓ ట్వీట్ అందరిలో పలు అనుమానాలకు తావిచ్చింది. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించి పూర్తి స్పష్టతను ఇచ్చింది. భారత బృందంలో కరోనా కేసుల నేపథ్యంలో ఇరు బోర్డులూ ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా పేర్కొన్నాడు.

ఇరు బోర్డుల అంగీకారంతో

ఇరు బోర్డుల అంగీకారంతో

బీసీసీఐ సెక్రటరీ జై షా మాట్లాడుతూ... 'భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరియు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా ఈ రోజు మాంచెస్టర్‌లో ప్రారంభం కానున్న 5వ టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించాయి. భారత బృందంలో కరోనా కేసుల నేపథ్యంలో ఇరు బోర్డులూ పలుమార్లు చర్చలు జరిపాయి. తొలుత ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని భావించాం.

అయితే ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో చర్చల అనంతరం రద్దు చేయడానికి ఏకాభిప్రాయానికి వచ్చాం. ఇరు బోర్డుల మధ్య మంచి బంధం ఉంది. కష్టసమయాల్లో మా పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించినందుకు ఈసీబీకి ధన్యవాదాలు. ఈ టెస్ట్ మ్యాచ్‌ని రీషెడ్యూల్ చేయడానికి ఒక విండోను కనుగొంటాం' అని తెలిపాడు.

US Open 2021లో పెను సంచలనం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఎమ్మా! పిన్న వయస్కురాలిగా రికార్డు!!

నిరాశలో ఫాన్స్

నిరాశలో ఫాన్స్

మరోవైపు ఫైనల్‌ మ్యాచ్‌ రద్దవ్వడంపై పలువురు మాజీలు, క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సామాజిక మాధ్యమాల్లో అసహనం వ్యక్తం చేశారు. భారత్ ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్నందున చివరి మ్యాచ్‌లోనూ గెలిచి ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇది వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా జ‌రుగుతున్న సిరీస్ కాబట్టి ఫైనల్ మ్యాచ్ ఆడితే బాగుందని కొందరు అంటున్నారు. ఇక టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా జ‌రుగుతున్న సిరీస్ కాబట్టి ఐసీసీ రూల్స్ ప్ర‌కారం.. ఓ టీమ్‌లో కొవిడ్ కేసు బ‌య‌ట‌ప‌డితే మ్యాచ్‌ను ర‌ద్దు చేయ‌వ‌చ్చు.

ఈసీబీ గందరగోళమైన ప్రకటన

ఈసీబీ గందరగోళమైన ప్రకటన

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌ రద్దుపై తొలుత ఇంగ్లండ్ అండ్ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) గందరగోళమైన ప్రకటన చేసింది. ఈ టెస్టులో టీమిండియా తమ తుది జట్టును బరిలోకి దింపలేకపోతున్నందున మ్యాచ్‌ను కోల్పోయిందని పేర్కొంది. తర్వాత ఈ వ్యాఖ్యలను సరిచేసుకొని ఐదో టెస్టు రద్దయినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ప్రకటనతో పూర్తి స్పష్టత వచ్చింది. ఇక భారత జట్టుకు ఈ ఏడాదంతా బిజీ షెడ్యూల్ ఉంది. వ‌చ్చే ఏడాది టీ20, వ‌న్డే సిరీస్ కోసం టీమిండియా మ‌ళ్లీ ఇంగ్లండ్ వ‌స్తోంది. మ‌రి అప్పుడు ఈ టెస్ట్ ఏమైనా ఆడ‌తారా అన్న‌ది చూడాలి.

మూడు టీ20లు, మూడు వన్డేలు

మూడు టీ20లు, మూడు వన్డేలు

వచ్చే సంవత్సరం జూలైలో భారత జట్టు ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుందని ఈసీబీ బుధవారం వెల్లడించింది. 2022లో స్వదేశంలో ఇంగ్లండ్‌ జట్టు ఆడే సిరీసుల వివరాలు ప్రకటించిన సందర్భంగా ఈ విషయం తెలిపింది. కరోనా కారణంగా సుదీర్ఘ పర్యటనలు నివారించే ఉద్దేశంతో గతంలో మాదిరి కాకుండా భారత జట్టు టెస్ట్‌లు, పరిమిత ఓవర్ల సిరీసులను విడివిడిగా నిర్వహిస్తున్నారు.

జూలై ఒకటిన ఓల్డ్‌ట్రాఫర్డ్‌లో జరిగే మ్యాచ్‌తో టీ20 సిరీస్‌ మొదలుకానుంది. తదుపరి రెండు మ్యాచ్‌లు ట్రెంట్‌బ్రిడ్జ్‌ (జూలై 3), ఏజెస్‌ బౌల్‌ (జూలై 6)లో జరుగుతాయి. 3వన్డేలను ఎడ్జ్‌బాస్టన్‌ (జూలై 9), ఓవల్‌ (జూలై 12), లార్డ్స్‌ (జూలై 14)లో నిర్వహిస్తారు.

Story first published: Friday, September 10, 2021, 19:08 [IST]
Other articles published on Sep 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+