ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్(ISPL) 2024 అరంగేట్ర సీజన్‌కు రంగం సిద్దమైంది. టెన్నిస్ బాల్‌తో జరిగే ఈ టీ10 క్రికెట్ లీగ్‌లో భారత స్టార్ హీరోలు భాగమయ్యారు. బుధవారం(మార్చి 6)నుంచి 15 వరకు ఈ గల్లీ క్రికెట్ టోర్నీ జరగనుంది. మహారాష్ట్రలోని దాదోజీ కొండదేవ్ స్టేడియం వేదికగా ఈ సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు తలపడనున్నాయి. మాజీ ముంబై, శ్రీనగర్ కే వీర్, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సింగమ్స్, బెంగళూరు స్ట్రైకర్స్, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా జట్లు ఈ టోర్నీ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.

ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కొనుగోలు చేయగా.. మాజీ ముంబై ఫ్రాంచైజీని అమితాబ్ బచ్చన్, చెన్నై సింగమ్స్‌ను సూర్య శివకుమార్, బెంగళూరు స్ట్రైకర్స్ హృతిక్ రోషన్, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా జట్టును సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్‌లు కొనుగోలు చేశారు.
ఈ టీ10 క్రికెట్ టోర్నీ మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్, సోనీ లైవ్ యాప్‌లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఈ టోర్నీకి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి చీఫ్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. మాజీ క్రికెటర్లు ప్రవీణ్ ఆమ్రె, జతిన్ పరాంజపేలు సెలెక్షన్ కమిటీ మెంబర్స్‌గా ఉన్నారు.
బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో శ్రీనగర్ కే వీర్ వర్సెస్ మాజీ ముంబై జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు బెంగళూరు స్ట్రైకర్స్‌తో తలపడనుంది.