For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్ టూర్ ముందు టీమిండియాకు మరో షాక్!

IND VS NZ 2020 : Ishant Sharma Sustains Ankle Injury Before Test Squad Announcement ! || Oneindia
Ishant Sharma suffers injury ahead of India Test squad announcement for New Zealand tour

న్యూఢిల్లీ : కీలక కివీస్ టూర్ ముందు కోహ్లీసేనకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయాలతో జట్టుకు దూరమవ్వగా.. తాజాగా మరో స్టార్ పేసర్, టెస్ట్ స్పెషలిస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు.

రంజీ ట్రోఫీలో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆడుతున్నఇషాంత్.. సోమవారం బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. విదర్భ సెకండ్ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో ఇషాంత్ వేసిన షాట్ డెలివరీని ప్రత్యర్థి కెప్టెన్ ఫైజ్ ఫజల్ పుల్ చేయబోగా బ్యాట్‌ను మిస్సైన బంతి ప్యాడ్‌లను తాకింది. దీంతో గట్టిగా అప్పిల్ చేయబోయిన ఇషాంత్ కాలు జారి యాంకిల్‌లో పట్టేసింది. వెంటనే టీమ్ ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స చేసినా ఇషాంత్ నొప్పితో విలవిలలాడాడు. ఈ బాధతోనే మైదానం వీడాడు.

'ఇషాంత్ చీలమండం మలుచుకొని వాచింది. ప్రస్తుతానికి పరిస్థితి బాగాలేదు. ఈ మ్యాచులో మళ్లీ ఆడించి సాహసం చేయలేం. ఎలాంటి చీలిక లేదనే భావిస్తున్నాం. అది పూర్తిగా వాపే అయితే అతడు కొన్ని రోజుల్లో పిట్ అవుతాడు. ఎంఆర్‌ఐ రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నాం.'అని ఢిల్లీ జట్టు మేనేజ్‌మెంట్ మెంబర్ ఒకరు తెలిపారు.

ప్రస్తుతానికైతే గాయం తీవ్రతపై స్పష్టతలేకపోయినప్పటికీ.. కివీస్ టూర్ టెస్ట్ ఎంపిక చేసే ముందు అతను గాయపడటం టీమ్‌మేనేజ్‌మెంట్‌ను కలవరపెడ్తోంది. ఇక ఈ మ్యాచ్ విదర్భ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇషాంత్ 45 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. గాయం ప్రభావం లేకుంటే ఇషాంత్ హమిల్టన్ వేదికగా జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు లేకుంటే నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) చేరుతాడు.

జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో కోహ్లీసేన 5 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్ట్‌లు ఆడనుంది. ఇప్పటికే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ..వన్డే, టెస్ట్ టీమ్స్‌ను ఎంపికచేయాల్సి ఉంది. కానీ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కోసం జట్ల ఎంపికను సెలెక్షన్ కమిటీ వాయిదా వేసుకుంటూ వస్తోంది. పాండ్యా గాయంపై ఎన్‌సీఏ గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీమ్స్‌ను ప్రకటించాలనుకుంటుంది.

వాస్తవానికి గత ఆదివారమే వన్డే, టెస్ట్ టీమ్స్‌ను ఎంపికచేయాల్సి ఉన్నా ప్రకటించలేదు. టీ20 వరల్డ్‌కప్ ప్లానింగ్స్‌లో భాగంగా పాండ్యా జట్టులోకి రావాలని టీమ్‌మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. అందుకే కివీస్ పర్యటనలో అతని కోసం ఎదురుచూస్తోంది. ఇక బ్యాక్ సర్జరీ నుంచి కోలుకున్న పాండ్యా ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమవడంతో ఇప్పటికే టీ20లకు దూరమయ్యాడు. ఫిట్‌నెస్ నిరూపించుకుంటే వన్డే టీమ్‌లో హార్ధిక్‌కు ప్లేస్ గ్యారంటీ.

Story first published: Monday, January 20, 2020, 19:35 [IST]
Other articles published on Jan 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+