For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ వ్యక్తిగత రికార్డులను పట్టించుకోడు.. జట్టు గురించే ఆలోచిస్తాడు! అతడి కోసమే రిటైర్మెంట్‌ ఇచ్చాడు!

Ishant Sharma says MS Dhoni may be retires Test cricket for Wriddhiman Saha
IND VS ENG: MS Dhoni Retires Test Cricket For Wriddhiman Saha- Ishant Sharma Reveals || Oneindia

అహ్మదాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఊహించని విషయాలు చెప్పాడు. వికెట్ ‌కీపర్‌ వృద్ధిమాన్ సాహాకు అవకాశాలు దక్కడం కోసమే ధోనీ టెస్టులకు వీడ్కోలు పలికాడని లంబూ తెలిపాడు. మహీ వ్యక్తిగత రికార్డులను పట్టించుకోడని, జట్టు గురించే ఆలోచిస్తాడని ఇషాంత్ పేర్కొన్నాడు. ఇషాంత్‌ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. తన టెస్టు కెరీర్‌లో ఇషాంత్‌ వందో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాడు. భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్ ‌(131) తర్వాత ఈ మైలురాయిని అందుకున్న భారత ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంతే కావడం విశేషం.

ఇంజెక్షన్లను తీసుకుని బౌలింగ్ చేశా:

ఇంజెక్షన్లను తీసుకుని బౌలింగ్ చేశా:

ఇషాంత్ శర్మ తన వందో టెస్ట్ మ్యాచ్ ముందు రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్‌ ఛానల్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. '2014 ఆస్ట్రేలియా పర్యటనలో మెల్‌బోర్న్‌ టెస్టులో మోకాలి నొప్పితో విపరీతంగా ఇబ్బందిపడ్డాను. దాదాపు ప్రతి సెషన్‌కు ఇంజెక్షన్లను తీసుకుని బౌలింగ్ చేశా. ఆ మ్యాచ్‌ తర్వాత మహీ రిటైర్‌‌ అవుతున్నాడని ఎవరికీ తెలియదు. ఎందుకంటే అందరం టెస్టు మ్యాచ్‌పైనే నిమగ్నమై ఉన్నాం. నాలుగో రోజు టీ సమయానికి ధోనీ వద్దకు వెళ్లి.. ఇక నేను ఇంజెక్షన్లను తీసుకోలేనని చెప్పా. సరే, ఫర్వాలేదు, నువ్వు బౌలింగ్ చేయకని అన్నాడు' అని లంబూ తెలిపాడు.

ఒంరిగా విడిచిపెట్టావ్‌ కదా అన్నాడు:

ఒంరిగా విడిచిపెట్టావ్‌ కదా అన్నాడు:

'ఇషాంత్.. నా ఆఖరి టెస్టులో నన్ను ఒంటరిగా విడిచిపెట్టావ్‌ కదా అని రిటైర్మెంట్ అనంతరం ఎంఎస్ ధోనీ అన్నాడు. అదే ఆఖరి మ్యాచ్‌ అని తెలిస్తే.. కచ్చితంగా బౌలింగ్ చేసేవాడినన్నాను. అది భావోద్వేగ సంఘటన. నిజంగా ఆ టెస్టు ఆఖరి రోజు వరకు మహీ టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నాడని తెలియదు' అని ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో మెల్‌బోర్న్‌ టెస్టు అనంతరం మహీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. దీంతో ఆ సిరీస్‌లోని ఆఖరి టెస్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వ బాధ్యతలు అందుకున్నాడు.

సాహా ఎదుగదల కోసం:

సాహా ఎదుగదల కోసం:

'ఎంఎస్ ధోనీ దాదాపు 100 టెస్టులకు దగ్గరగా ఆడాడు. అతడు వ్యక్తిగత రికార్డులను ఏమాత్రం పట్టించుకోడు. జట్టు మంచి కోసమే ఆలోచిస్తాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో మహీతో మాట్లాడిన ఓ సందర్భం నాకు గుర్తుంది. 100 టెస్టుల మైలురాయిని అందుకోవడం నాకు పెద్ద విషయమేమి కాదు. వచ్చే సిరీస్‌ భారత్‌లోనే ఉందని నాతో ధోనీ అన్నాడు. అతడు సాహా ఎదుగదల గురించి ఆలోచించి రిటైర్మెంట్ ఇచ్చాడని భావిస్తున్నా. ఆ తర్వాత స్వదేశంలో సుదీర్ఘ సిరీస్ ఉంది. అందుకే అతడు వీడ్కోలు పలికి ఉంటాడు' అని లంబూ చెప్పుకొచ్చాడు.

కెరీర్‌లో వందో మ్యాచ్:

కెరీర్‌లో వందో మ్యాచ్:

ఈరోజు వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఇషాంత్ శర్మకి టీమిండియా ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ హానర్' పలికారు. కెరీర్‌లో వందో మ్యాచ్ ఆడబోతున్న ఇషాంత్ బౌలింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తున్న సమయంలో వరుసలో నిల్చొన్న భారత క్రికెటర్లు.. అతనికి సగౌరవంగా స్వాగతం పలికారు. స్టేడియంలో వేలాది మంది అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య మైదానంలోకి వచ్చిన లంబూ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేశాడు. ఓపెనర్ డొమినిక్ సిబ్లేను డకౌట్ చేశాడు.

PinkBall Test: వైరల్ వీడియో.. స్మిత్‌ని టీజ్ చేసిన కోహ్లీ!!

Story first published: Wednesday, February 24, 2021, 21:22 [IST]
Other articles published on Feb 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+