Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రహానే బౌలర్ల కెప్టెన్.. కోహ్లీ లేకున్నా పర్వాలేదు: ఇషాంత్‌

Ishant Sharma feels Ajinkya Rahane is Bowlers Captain

న్యూఢిల్లీ: పితృత్వ సెలవులపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ వచ్చాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో తొలి బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే కోహ్లీ ఇండియాకి వచ్చేశాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా అతనికి పితృత్వ సెలవులు మంజూరు చేసింది. దీంతో మిగతా మూడు టెస్టులకు విరాట్ దూరంకానున్నాడు. కోహ్లీ గైర్హాజరీతో భారత టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అజింక్య రహానే అందుకున్నాడు. తొలి టెస్టులో ఘోర పరాజయం.. కోహ్లీ, మొహ్మద్ షమీ జట్టుకు దూరమైన ప్రతికూల పరిస్థితుల్లో జింక్స్ జట్టును ఎలా నడిపిస్తాడని అందరిలో ప్రశ్నలు మొదలయ్యాయి.

రెండు టెస్టుల్లోనూ విజయం:

రెండు టెస్టుల్లోనూ విజయం:

టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానే బౌలర్ల కెప్టెన్ అని సీనియర్ పేసర్‌ ఇషాంత్ ‌శర్మ పేర్కొన్నాడు. రహానే ప్రశాంతమైన ప్రవర్తన ఆస్ట్రేలియాతో మిగతా టెస్టుల్లో టీమిండియాను విజయవంతంగా నడిపిస్తుందన్నాడు. కోహ్లీ లేకున్నా.. రహానే అద్భుతంగా జట్టును ముందుకు సడిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీ గైర్హాజరీలో రహానే ఇప్పటివరకు రెండు టెస్టులకు కెప్టెన్సీ చేయగా.. రెండింట్లోనూ భారత్ విజయం సాధించాడు. ఐపీఎల్ 2020లో పక్కటెముకలకు గాయం అవ్వడంతో ఇషాంత్ ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే.

రహానే బౌలర్ల కెప్టెన్‌:

రహానే బౌలర్ల కెప్టెన్‌:

తాజాగా ఇషాంత్ శర్మ ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ భారత్-ఆస్ట్రేలియా పర్యటనపై స్పందించాడు.'అజింక్య రహానే చాలా ప్రశాంతంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. విరాట్‌ కోహ్లీ లేనప్పుడు మేం కలిసి ఆడిన సందర్భాల్లో.. నీకు ఎలాంటి ఫీల్డింగ్ కావాలి? ఎక్కడ బంతుల్ని వేయాలనుకుంటున్నావ్‌? బౌలింగ్ చేస్తావా? అని అతడే వచ్చి అడిగేవాడు. రహానే బౌలర్ల కెప్టెన్‌. ఇలా బౌలింగ్ చేయి, అలా ఆడు.. అని అతడు చెప్పేవాడు కాదు. జింక్స్ బౌలర్లకు ఎప్పుడూ అండగా ఉంటాడు. జట్టు నుంచి ఉత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో అతడికి స్పష్టత ఉంది' అని ఇషాంత్ తెలిపాడు.

హాస్యచతురత లేదని కాదు:

హాస్యచతురత లేదని కాదు:

'అజింక్య రహానే భావోద్వేగాల్ని నియంత్రణలో ఉంచుకుంటాడు. అలా అని అతడికి హాస్యచతురత లేదని కాదు. మాతో ఎంతో సరదాగా ఉంటాడు. అయితే అతడి ప్రశాంతతే జట్టులో ఉత్సాహన్ని నింపుతుంది. ఒత్తిడిలో కంగారు లేకుండా బౌలర్లతో తన అభిప్రాయాలను స్పష్టంగా చెబుతాడు' అని ఇషాంత్ శర్మ చెప్పాడు. విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటే ఆటగాళ్లలో కలిగే ఉత్సాహం వేరని, అతడిలా మరెవరు జట్టును ఉత్తేజపరచలేరని లంబూ అన్నాడు. ఇషాంత్ ఇటీవలి కాలంలో ఎక్కువగా గాయాల బారిన పడుతున్న విషయం తెలిసిందే.

మెల్‌బోర్న్‌ వేదికగా రెండో టెస్ట్:

మెల్‌బోర్న్‌ వేదికగా రెండో టెస్ట్:

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలి భారత క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ అందుకోలేదు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే అత్యధికం. భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనుకంజలో ఉంది. మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్ 26 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.

ఐపీఎల్‌ పాలకమండలికి ప్రజ్ఞాన్‌ ఓజా నామినేట్‌!!

Story first published: Thursday, December 24, 2020, 9:59 [IST]
Other articles published on Dec 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+