బ్యాంకు ఉద్యోగిగా ఇషాన్ కిషన్.. జీతం ఎంతంటే!
టీమ్ఇండియా యువ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. స్పోర్ట్స్ కోటాలో ఇషాన్ కిషన్‌కు రిజర్వ్ బ్యాక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం లభించింది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రేక్ రావడంతో ఇషాన్ కిషన్ విధుల్లో చేరాడు.
పట్నాలోని ఆర్‌బీఐ రీజనల్ ఆఫీస్‌లో విధులు నిర్వహించాడు. ఈ సందర్భంగా బ్యాంక్ సిబ్బంది ఇషాన్ కిషన్‌తో ఫొటోలు దిగారు. అవి నెట్టింట వైరల్ అయ్యాయి. ఆటతో పాటు ఉద్యోగ బాధ్యతలూ నిర్వర్తించడంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఆర్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్‌గా ఇషాన్ కిషన్‌కు సుమారు రూ.1.22 లక్షల నుంచి రూ.1.24 లక్షల వరకు జీతం రానుంది. పీఎఫ్, ఇతర కంటింగ్స్ పోను అతనికి నెలకు రూ.1.08 లక్షల నుంచి 1.12 లక్షల జీతం వచ్చే అవకాశం ఉంది.
దేశవాళీ క్రికెట్‌లో అద్వితీయమైన ప్రదర్శనతో అనూహ్యంగా భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. నిలకడైన ఆటతీరుతో జట్టు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లోనే లేని ఇషాన్ కిషన్ చివరి నిమిషంలో జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో సత్తా చాటి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో తడబడినా.. ఇతర బ్యాటర్ల కంటే మెరుగైన పరుగులే చేశాడు. జింబాబ్వే పర్యటనలో మళ్లీ తన ఫామ్ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం భారత్ టెస్ట్ సిరీస్ ఆడనుండటంతో ఇషాన్ కిషన్‌కు సుదీర్ఘ విరామం లభించింది.
టీమిండియా తదుపరి టీ20 సిరీస్ అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో ఆడనుంది. ఈ సిరీస్‌తోనే ఇషాన్ కిషన్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు. అయితే ఈ బ్రేక్‌లో దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌ను ఇషాన్ కిషన్ నడిపించనున్నాడు. ఆగస్ట్ 23 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో నార్త్ జోన్‌తో ఈస్ట్ జోన్ తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

