Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీహారోడే గానీ తెలుగోళ్ల మనసులు దోచేసాడు!(వీడియో)

సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌ఛల్ చేస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రజల మనసులను గెలుచుకున్న ఈ వీడియో టాక్ ఆఫ్ ది క్రికెట్ సర్కిల్‌గా మారింది. ఐపీపఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.

సోమవారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు వికెట్లతో ఓడించిన ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 181 పరుగుల లక్ష్యఛేదనలో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.

Ishan Kishan Wins Hearts After Touching Nitish Kumar Reddy s Parents Feet Post-CSK Clash

ఈ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఇషాన్ కిషన్ దారుణంగా ఎగతాళి చేశాడు. ఇక ఇంటికెళ్లి విజిల్స్ వేసుకోవాలని, త్వరగా ప్యాకప్ అవ్వండని సైగలు చేశాడు. అతని సెలెబ్రేషన్స్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగింది. ఈ ఒక్క చర్యతో ఈ బిహార్ కుర్రాడు తమిళనాడు మొత్తానికి విలన్‌గా మారిపోయాడు. ఇది చెన్నై అభిమానులను అగౌరవపర్చడమేనని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓవైపు సోషల్ మీడియా వేదికగా అతనిపై తమిళ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు తెలుగు అభిమానులు మాత్రం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎందుకంటే చెన్నైపై విజయానంతరం టీమ్ హోటల్‌లో ఇషాన్ కిషన్.. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులను కలిసాడు. వారిని చూసిన వెంటనే కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. టీమ్ వైస్ కెప్టెన్ అనే అహం ఏమాత్రం చూపించకుండా పెద్దల పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు.

ఇషాన్ చర్యతో స్టన్ అయిన నితీష్ తల్లిదండ్రులు అతన్ని హత్తుకున్నారు. నితీష్‌తో కలిసి అందరూ ఫొటోకు ఫోజిచ్చారు. ఈ సందర్భంగా ఆర్‌సీబీతో మ్యాచ్‌కు వస్తున్నారా అంకుల్ అని ఇషాన్ అడగ్గా.. వస్తున్నామని నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి తెలిపాడు.

'మీరు వస్తే మేం మరింత ప్యాషన్‌తో ఆడుతాం'అని ఇషాన్ బదులిచ్చాడు. ఈ వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఎక్స్‌వేదికగా 'ఇది ఆరెంజ్ ఆర్మీ బంధం అంటే' అనే క్యాప్షన్‌తో పంచుకుంది. ఈ వీడియోకు తెలుగు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'బీహారోడే గానీ తెలుగోళ్ల మనసులు దోచేసాడు'అని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Tuesday, May 19, 2026, 21:15 [IST]
Other articles published on May 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+