వైభవ్ అప్పనంగా క్రెడిట్ కొట్టేసాడు.. బుడ్డోడిని ఆట పట్టించిన ఇషాన్ కిషన్!
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆట పట్టించాడు. దులీప్ ట్రోఫీ 2026 విజయానంతరం ఈ 15 ఏళ్ల కుర్రాడితో సరదాగా మాట్లాడిన ఇషాన్ కిషన్.. డీఆర్‌ఎస్‌ల విషయంలో అప్పనంగా క్రెడిట్ కొట్టేసాడని తెలిపాడు. తాను డీఆర్‌ఎస్‌లు తీసుకుంటే వైభవ్ సలహాతోనే తీసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరిగిందన్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య సరదాగా సాగిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
సౌత్ జోన్‌తో చెన్నై వేదికగా శుక్రవారం ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైనల్ డ్రా కావడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్‌ను విజేతగా ప్రకటించారు. దాంతో ఆ జట్టు 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ గెలిచింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తీసుకున్న డీఆర్‌ఎస్‌లు సక్సెస్ అయ్యాయి. ఇషాన్ కిషన్‌ను ఒప్పించి మరీ అతను ఫలితం రాబట్టాడు. దాంతో వైభవ్ సూర్యవంశీపై నెట్టింట ప్రశంసల జల్లు కురిసింది.

పక్కన నిలబడి క్రెడిట్ కొట్టేసాడు..
అయితే ఈ డీఆర్‌ఎస్‌ల విషయంలో వైభవ్ సూర్యవంశీ అప్పనంగా క్రెడిట్ పొందాడని ఇషాన్ కిషన్ అన్నాడు. 'ఆ డీఆర్ఎస్‌ల క్రెడిట్ అంతా ఇప్పటికే అందరూ తీసేసుకున్నారు. నిజానికి రివ్యూ తీసుకోవాల్సింది నేనే అయినప్పటికీ.. తను అలా క్యాజువల్‌గా నా దగ్గరకు వచ్చి 'నేను నీ దగ్గరకు వస్తా లే' అనేవాడు. అంతే నెట్టింట 'అబ్బో వైభవ్ గొప్పదనం!' అని రచ్చ చేసేవారు. ఏదేమైనా వైభవ్ ఆ రోల్‌ను చాలా బాగా చేశాడు'అని ఇషాన్ నవ్వుతూ అన్నాడు.
ఆ మాటలకు వెంటనే వైభవ్ జోక్యం చేసుకుంటూ.. 'ఫీల్డింగ్‌లో నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఆ రివ్యూలు ఎవరు తీసుకున్నారు? ఆ విషయం కూడా చెప్పాలి కదా?'అని వైభవ్ నిలదీశాడు. ఇషాన్ వెంటనే ఆ విషయాన్ని అంగీకరిస్తూ.. డ్రెస్సింగ్ రూమ్‌లో వైభవ్ ప్రభావం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంకా డేంజరస్‌గా ఎదుగుతాడు..
'అది కూడా వైభవ్‌యే చేశాడు. కానీ అతను టీమ్‌లో ఉండటం చాలా మంచి విషయం. అతను కేవలం ఒక మంచి ప్లేయర్ మాత్రమే కాదు. జూనియర్ అయినా.. సీనియర్ అయినా అందరినీ బాగా చూసుకున్నాడు. అన్నట్టు.. ఇక్కడ అందరికంటే జూనియర్ నువ్వే కాదా.. సారీ, సారీ!'అని ఇషాన్ కిషన్ నవ్వేశాడు.
భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ ఇంకా ప్రమాదకరమైన ఆటగాడిగా ఎదుగుతాడని ఆశిస్తున్నా. ఇది అతనికి మొదటిది లేదా చివరి మంచి ప్రదర్శన మాత్రమే కాదు. అతను ఇలాంటి మ్యాచ్‌లు ఇంకా చాలా ఆడుతాడు. ఇప్పుడు చేస్తున్నట్లే మున్ముందు కూడా రాణిస్తూనే ఉంటాడు.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


