For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇషాన్ కిషన్ ఇస్మార్ట్ క్యాచ్.. అచ్చం ధోనీలానే..!(వీడియో)

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. టీమిండియా దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేసే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరమై చాలా రోజులు అవుతున్నా.. వికెట్ కీపర్‌గా తాను పూర్తి టచ్‌లోనే ఉన్నానని చాటి చెప్పాడు.

తమిళనాడు వేదికగా జరుగుతున్న బుచ్చి బాబు టోర్నీలో జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఇషాన్ కిషన్.. మధ్య ప్రదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. 74వ ఓవర్‌లో జార్ఖండ్ బౌలర్ వేసిన బంతి ఆశ్చర్యకరంగా ఎక్స్‌‌ట్రౌ బౌన్స్ అయ్యింది. దాంతో బ్యాటర్ ఆదిత్య సింగ్ కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది.

Ishan Kishan Takes Sharp Catch Behind Wickets In Buchi Babu Tournament Video Goes Viral

వెంటనే అప్రమత్తమైన ఇషాన్ కిషన్ ముందుకు పరుగెత్తుతూ.. క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్యాచ్‌ను చూసి నెటిజన్లు అచ్చం ధోనీలానే అందుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. చూడటానికి సునాయసంగా ఉన్నా.. ఈ క్యాచ్ అందుకోవడం వికెట్ కీపర్లకు చాలా కష్టమని, ఇదో ఇస్మార్ట్ క్యాచ్ అని కొనియాడుతున్నారు.

గతేడాది భారత జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్.. దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసాడు. రంజీ ట్రోఫీ ఆడకుండా హార్దిక్ పాండ్యాతో కలిసి ఐపీఎల్‌కు సన్నదమయ్యాడు. దాంతో ఆగ్రహానికి గురైన బీసీసీఐ.. అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడంతో పాటు టీమిండియాకు ఎంపిక చేయలేదు.

అప్పటి నుంచి అతను ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరమయ్యాడు. వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుండటంతో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ఇషాన్ కిషన్.. బుచ్చిబాబు టోర్నీ ఆడుతున్నాడు. దులీప్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. ఈ రెండు టోర్నీల్లో రాణిస్తే అతను మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Story first published: Friday, August 16, 2024, 9:52 [IST]
Other articles published on Aug 16, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+