Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇషాన్ కిషన్ విధ్వంసం.. 33 బంతుల్లోనే శతకం!

దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్ డైనమైట్, టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దుమ్మురేపుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫామ్‌ను కొనసాగిస్తూ దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీతో చెలరేగాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఎంపికైన ఆనందమో ఏమో తెలియదు కానీ ఇషాన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.

జార్ఖండ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్.. ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా కర్ణాటకతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 33 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 412 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ సింగ్(88), కుశాగ్ర(63) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Ishan Kishan Smashes 33-Ball Century in Vijay Hazare Trophy Creates History

ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 33 బంతుల్లోనే సెంచరీ బాది లిస్ట్-ఏ క్రికెట్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను అన్మోల్ ప్రీత్ సింగ్(35 బంతుల్లో శతకం), వైభవ్ సూర్యవంశీ(36 బంతుల్లో సెంచరీ)ల రికార్డ్‌ను అధిగమించాడు. బిహార్ బ్యాటర్ సకిబుల్ గని 33 బంతుల్లో సెంచరీ బాది ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ అందుకున్నాడు.

లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన భారత ఆటగాళ్లు..

సకీబుల్ గని- 32 బంతుల్లో

ఇషాన్ కిషన్-33 బంతుల్లో

అన్మోల్‌ప్రీత్ సింగ్-35 బంతుల్లో

వైభవ్ సూర్యవంశీ-36 బంతుల్లో

Story first published: Wednesday, December 24, 2025, 16:05 [IST]
Other articles published on Dec 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+