Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: ఇషాన్ కిషన్ ఊచకోత.. ఒకే ఓవర్లో 6,1,6,6,4,6

Ishan Kishan: టీమిండియా విధ్వంసకర బ్యాటర్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో సౌతాఫ్రికాతో ముంబై వేదికగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 20 బంతుల్లోనే 53 రన్స్ చేశాడు.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన ఇషాన్ కిషన్ అదే జోరును కొనసాగించాడు. ఓపెనర్‌గా ప్రమోషన్ అందుకొని వామప్ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సహచర ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఒకే ఓవర్లో 29 పరుగులు చేశాడు.

అన్రిచ్ నోకియా వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి అభిషేక్ సిక్స్ కొట్టి రెండో బంతికి సింగిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ వరుసగా 6, 6, 4, 6 బాదాడు. 7 సిక్సులు, 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్ టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని ఈ మ్యాచ్ ద్వారా టీమ్ మేనేజ్‌మెంట్ హింట్ ఇచ్చింది.

Ishan Kishan Smashes 29 Runs in an Over vs Anrich Nortje in IND vs SA T20 World Cup Warm-up Match

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లకు అదిరిపోయే బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. ఇషాన్ కిషన్‌తో పాటు అభిషేక్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24) రిటైర్డ్ ఔటవ్వగా.. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన తిలక్ వర్మ(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) తన జోరు కొనసాగించగా.. అక్షర్ పటేల్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) దూకుడుగా ఆడాడు.

ధాటిగా ఆడే క్రమంలో రింకూ సింగ్(13బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 16), ఔటవ్వగా.. హార్దిక్ పాండ్యా(10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 240 పరుగులు చేసింది. భారత బ్యాటర్ల ధాటికి సౌతాఫ్రికా బౌలర్లు పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు. మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, అన్రిచ్ నోర్జ్, మఫకా తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, February 4, 2026, 20:09 [IST]
Other articles published on Feb 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+