Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్.. సీఎస్‌కే ఔట్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. సోమవారం చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో పాటు గుజరాత్ టైటాన్స్ బెర్త్ కూడా ఖాయమైంది.

సీఎస్‌కే అవకాశాలు మాత్రం సంక్లిష్టంగా మారాయి. అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచినా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదు. ఇతర జట్ల ఫలితాలు కలిసొస్తే తప్పా టోర్నీలో ముందడుగు వేయలేదు.

ఇషాన్ దార్ ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల‌కు 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), కార్తీక్ శర్మ(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. సాకిబ్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగలకు చెరో వికెట్ దక్కింది.

Ishan Kishan Sizzling 70 Powers Sunrisers Hyderabad to a Five-Wicket Victory Over CSK to Seal Playoff Berth

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి గెలుపొందింది. ఇషాన్ కిషన్(47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్ (26 బంతుల్లో 6 ఫోర్లతో47) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. సీఎస్‌కే బౌలర్లలో ముఖేష్ చౌదరి రెండు వికెట్లు తీయగా.. అకీల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ తీసారు.

క్లాసెన్ ఊచకోత..

181 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ ట్రావిస్ హెడ్(6) మరోసారి నిరాశపర్చగా.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆచితూచి ఆడారు. దాంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టానికి 45 పరుగులే చేసింది. తన శైలికి భిన్నంగా ఆడలేకపోయిన అభిషేక్ శర్మ(26)‌ను అకీల్ హోసెన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

క్రీజులోకి వచ్చిన హెన్రీచ్ క్లాసెన్‌తో కలిసి ఇషాన్ కిషన్ చెలరేగాడు. ఈ ఇద్దరూ సీఎస్‌కే బౌలర్లపై విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. హాఫ్ సెంచరీకి చేరువైన హెన్రీచ్ క్లాసెన్(47)ను నూర్ అహ్మద్ స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

క్రీజులోకి నితీష్ కుమార్ రెడ్డి రాగా.. ఇషాన్ కిషన్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో నితీష్ రెడ్డి(11) ఔటైనా.. సలీల్ అరోరా(10 నాటౌట్)తో కలిసి ఇషాన్ కిషన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. విజయం ముంగిట ఇషాన్ ఔటైనా.. సలిల్ అరోరా, రవిచంద్రన్ స్మరణ్(5 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.

Story first published: Monday, May 18, 2026, 23:43 [IST]
Other articles published on May 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+