న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పడం వల్లనే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశానని యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇషాన్ కిషన్ క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడాడు. రిషభ్ పంత్ తరహాలో చెలరేగి 35 బంతుల్లోనే కెరీర్ తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఈ ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడిన ఇషాన్ కిషన్ విరాట్ కోహ్లీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. అతను చెప్పడంతోనే తాను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చానని తెలిపాడు. జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరు తనకు అండగా నిలిచారని, ఈ సిరీస్‌కు ముందు రిషభ్ పంత్ కూడా విలువైన సలహాలు ఇచ్చాడని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.

'ఈ ఇన్నింగ్స్ నాకు చాలా స్పెషల్. జట్టు నా నుంచి ఏం ఆశిస్తుందో బాగా తెలుసు. జట్టులో ప్రతీ ఒక్కరూ నాకు అండగా నిలిచారు. ముఖ్యంగా విరాట్ భాయ్ వల్లే నాకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ దక్కింది. ఆయన చెప్పడంతోనే నన్ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. వెళ్లి నీ ఆట చూపించమని నన్ను ప్రోత్సహించారు.
స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ బౌలింగ్ చేస్తుండడంతో నాకు బ్యాటింగ్ చాలా ఈజీ అయిపోయింది. అప్పుడప్పుడూ జట్టు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వర్షం ఆగిన తర్వాత 10-12 ఓవర్లు ఆడాలనుకున్నాం. కనీసం 70-90 పరుగులు జత చేస్తే వెస్టిండీస్‌కు 370-380 స్కోరు పెట్టవచ్చని భావించాం.
ఇక్కడికి రావడానికి ముందు నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో రిషబ్ పంత్‌ను కలిసాను. ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు. అండర్-19 నుంచే ఇద్దరం కలిసి ఆడుతున్నాం. రిషబ్ పంత్ ఇచ్చిన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 438 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ(206 బంతుల్లో 11 ఫోర్లతో 121) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(80), యశస్వీ జైస్వాల్(57), రవీంద్ర జడేజా(61), రవిచంద్రన్ అశ్విన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు.

విండీస్ బౌలర్లలో జోమెల్ వార్రికన్, కీమర్ రోచ్ మూడేసి వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీసాడు. షెన్నన్ గాబ్రియల్‌కు ఓ వికెట్ దక్కింది.అనంతరం వెస్టిండీస్ మహమ్మద్ సిరాజ్(5/60) ధాటికి 255 పరుగులకు కుప్పకూలింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్(75) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సిరాజ్‌కు తోడుగా ముఖేశ్ కుమార్, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఓ వికెట్ తీసాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ ధనాధన్ బ్యాటింగ్‌తో 24 ఓవర్లలోనే 2 వికెట్లకు 181 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. రోహిత్ శర్మ(57), ఇషాన్ కిషన్(52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. యశస్వి(38), శుభ్‌మన్ గిల్(29) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
365 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన వెస్టిండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 76 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్(28), కిర్క్ మెక్‌కెంజీ(0) విఫలమవ్వగా.. తేజ్‌నారయణ్ చంద్రపాల్(24 బ్యాటింగ్), జెర్మైన్ బ్లాక్‌వుడ్(20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీసాడు.