
కోహ్లీ దగ్గరకు తీసుకొని..
అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఓటమి అనంతరం తీవ్ర బాధలో ఉన్న ఇషాన్ కిషన్‌ను విరాట్ కోహ్లీ ఓదార్చాడు. దగ్గరకు తీసి ధైర్యం చెప్పాడు. వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ తర్వాత ఓ మ్యాచ్‌కు తుది జట్టులో చోటు కోల్పోయిన ఇషాన్.. రాస్థాన్ రాయల్స్‌తో తదుపరి మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్నాడు. దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జోరు కనబర్చాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన ఇషాన్ కిషన్ కోహ్లీ చెప్పిన మాటలతోనే ఫామ్ అందుకున్నానని చెప్పాడు.

నువ్వే ఓపెనర్ అన్నాడు..
'నేను విరాట్ భాయ్‌తో మాట్లాడాను. నిలకడలేమి ఆటతో ఇబ్బంది పడుతున్న నాకు జస్‌ప్రీత్ బుమ్రా కూడా సాయం చేశాడు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతోపాటు జట్టులోని ప్రతి ఒక్కరూ నాకు అండగా నిలిచారు. ఇది నేర్చుకునే దశ అని, ఐపీఎల్‌లో చేసిన తప్పులను తెలుసుకుని వాటిని టీ20 ప్రపంచ కప్‌లో పునరావృతం కాకుండా చూసుకోవాలని వారు నాకు సూచించారు. విరాట్ భాయ్ అయితే 'నువ్వు టీ20 మెగా టోర్నీకి ఓపెనర్‌గా ఎంపిక అయ్యావు. అందుకోసం సిద్ధంగా ఉండాలి. ఏ సవాలునైనా స్వీకరించేందుకు పూర్తిస్థాయిలో సమయాత్తం కావాలి'అని చెప్పాడు. నాకెంతో ఆనందంగా అనిపించింది. నిజానికి ఓపెనింగ్ చేయడమంటే నాకెంతో ఇష్టం'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.

సంతోషంగా ఉంది..
టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ.. మెగా టోర్నీ ముందు ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉందని ఇషాన్ తెలిపాడు. 'నాతో పాటు జట్టులోని మిగతా సభ్యులు కూడా రాణించడం సంతోషకరం. టీ20 ప్రపంచకప్ ముందు ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉంది. పూర్తి సానుకూల దృక్పథంతో ఆడాము. 250-260 పరుగులు చేయాలని భావించాం. ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఎప్పుడు పరిస్థితులు, ఎలా మారతాయో తెలియదు. ఏదేమైనా మన అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కనబరచడమే ముఖ్యం.' ఇషాన్ తెలిపాడు. ఇషాన్ కిషన్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన సూర్యకుమార్ యాదవ్(82) సైతం ఫామ్‌లోకి వచ్చాడు. ఇది టీమిండియాకు శుభపరిణామం.

బౌండరీల వర్షం..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84), సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 82) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. హోల్డర్‌కు 4 వికెట్లు దక్కగా... నబీ 5 క్యాచ్‌లు అందుకొని ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఫీల్డర్‌గా నిలిచాడు. అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ మనీశ్ పాండే (41 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 నాటౌట్) అర్ధ సెంచరీ చేయగా... అభిషేక్ శర్మ (16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 33), జేసన్ రాయ్ (21 బంతుల్లో 6 ఫోర్లతో 34) రాణించారు.


Click it and Unblock the Notifications












