For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్సర్లు కొట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య.. ఇక సింగిల్స్ ఎందుకు?: ఇషాన్ కిషన్

Ishan Kishan says My strength is to hit sixes so why think about rotating strike

రాంచీ: సౌతాఫ్రికాతో రెండో వన్డేలో దంచి కొట్టిన ఇషాన్ కిషన్(84 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 93) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మరో 7 పరుగులు చేసుంటే కెరీర్‌లో తొలి సెంచరీని ఖాతాలో వేసుకునేవాడు. అయితే శతకం చేజారినందుకు తనకు ఎలాంటి బాధలేదని, వ్యక్తిగత స్కోర్ కంటే జట్టు కోసం ఆడటమే తనకు ముఖ్యమని తెలిపాడు. రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇషాన్ కిషన్.. సెంచరీ చేజార్చుకోవడంపై ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు.

సిక్సర్లు బాదడం వెన్నతో పెట్టిన విద్య..

సిక్సర్లు బాదడం వెన్నతో పెట్టిన విద్య..

సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తే సెంచరీ పూర్తయ్యేది కదా? అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. సిక్సర్లు బాదడం తనకు వెన్నతో పెట్టిన విద్యని, అలాంటప్పుడు సింగిల్స్ ఎందుకని ఎదురు ప్రశ్నించాడు. 'కొంతమంది ఆటగాళ్లు వికెట్ల మధ్య స్ట్రైక్ రొటేట్ చేస్తారు. కానీ నేను అలా కాదు. నా బలం సిక్సర్లు బాదడం. చాలా మంది ఇబ్బందిపడే పని.. నాకు చాలా సులువు. నేను సిక్సర్లు కొట్టడంలో సఫలమవుతున్నప్పుడు మళ్లీ సింగిల్స్ తీయడం ఎందుకు..? మీ బలాన్ని బట్టి ముందుకెళ్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. అయితే ఈ ఫార్ములా ప్రతీసారి వర్కవుటవ్వదు.

 అలా ఆడితే మోసం చేసినట్లే..

అలా ఆడితే మోసం చేసినట్లే..

క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నప్పుడు క్రీజులోకి వచ్చి సిక్సర్లు కొడతామంటే కుదరదు. అప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయాలి. వికెట్ల మధ్య పరుగెత్తాలి. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్ లో నేను మరో 7 పరుగులు చేస్తే సెంచరీ చేసేవాడినే. కానీ సెంచరీ కోసం చూసుకుని ఉంటే నేను జట్టుకు అన్యాయం చేసినవాడిని అవుతాను. అది నా స్వార్థం కోసం అవుతుంది. నా దేశం తరఫున ఆడుతూ వ్యక్తిగత స్కోరు మీద దృష్టి పెట్టడం సరికాదనేది నా అభిప్రాయం. అది మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులను కూడా వంచించినట్టే.'ఇషాన్ కిషన్ తెలిపాడు.

ఎవడ్రా బీ టీమ్..

ఎవడ్రా బీ టీమ్..

ఇక తమను 'ద్వితీయ శ్రేణి టీమ్'గా పరిగణించడంపై ఇషాన్ కిషన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'సౌతాఫ్రికాతో ఆడుతున్న మమ్మల్ని చాలా మంది ద్వితీయ శ్రేణి టీమ్‌గా పిలుస్తున్నారు. అలా పిలవడం నాకు అస్సలు నచ్చదు. తొలి మ్యాచ్ లో మేం ఓడిన తర్వాత ఈ కామెంట్లు ఇంకా ఎక్కువయ్యాయి. అందుకే మేం ఈరోజు ఏ టీమ్ గేమ్ ఆడి విజయం సాధించాం.' అని అన్నాడు

 అదరగొట్టిన అయ్యర్..

అదరగొట్టిన అయ్యర్..

శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌ (111 బాల్స్‌‌లో 15 ఫోర్లతో 113 నాటౌట్) క్లాసిక్‌‌ సెంచరీకి తోడు హోమ్​టౌన్​ రాంచీలో యంగ్‌‌స్టర్‌‌ ఇషాన్‌‌ కిషన్‌‌ (84 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 93) కెరీర్‌‌ బెస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌తో రప్ఫాడించడంతో భారత్ ఘన విజయాన్నందుకుంది. దాంతో, మూడు వన్డేల సిరీస్‌‌ 1-1తో సమం అయ్యింది. తొలుత హైదరాబాదీ మహ్మద్‌‌ సిరాజ్‌‌ (10-1-38-3) కట్టుదిట్టమైన బౌలింగ్‌‌తో ఆకట్టుకోవడంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 278/7 స్కోరు చేసింది. మార్‌‌క్రమ్‌‌ (79), రీజా హెండ్రిక్స్‌‌ (74) సత్తా చాటారు. అనంతరం శ్రేయస్ అయ్యర్‌‌, ఇషాన్‌ కిషన్‌ మూడో వికెట్‌‌కు 161 రన్స్​ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌తో ఇండియా 45.5 ఓవర్లలోనే 282/3స్కోరు చేసి ఈజీగా గెలిచింది. కెరీర్‌‌లో రెండో సెంచరీ సాధించిన శ్రేయస్‌‌ ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా నిలిచాడు. సిరీస్‌‌ విజేతను తేల్చే మూడో వన్డే మంగళవారం ఢిల్లీ వేదికగా జరుగనుంది.

Story first published: Monday, October 10, 2022, 15:45 [IST]
Other articles published on Oct 10, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+