For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హిట్టింగ్ చేస్తానని మ్యాచ్‌కి ముందే వారికి చెప్పా.. కానీ ఫస్ట్‌ మ్యాచ్ కావడంతో: ఇషాన్ కిషన్

Ishan Kishan says I spoke to Team India management before 2nd T20I match about my batting

అహ్మదాబాద్: టీమిండియా యువ బ్యాట్స్‌మన్ ఇషాన్‌ కిషన్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రంలో తన ముద్ర బలంగా వేయాలనే ఉద్దేశంతో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. తానాడిన తొలి బంతినే బౌండరీకి పంపిన కిషన్.. ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్‌ చేశాడు. ఆడేది తొలి మ్యాచ్ అయినా.. చూడముచ్చటైన షాట్లతో బౌండరీలు, సిక్సులు బాదాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీతో కలిసి వేగంగా పరుగులు చేశాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది అంతర్జాతీయ క్రికెట్లో తొలి అర్ధ సెంచరీ (56; 32 బంతుల్లో 5×4, 4×6) అందుకున్నాడు. అయితే ఫస్ట్‌ మ్యాచ్ కావడంతో కాస్త ఒత్తిడిగా అనిపించిందని కిషన్ మ్యాచ్ అనంతరం చెప్పాడు.

మ్యాచ్ పూర్తి చేయాలనుకున్నా

మ్యాచ్ పూర్తి చేయాలనుకున్నా

'ఈ క్రెడిట్ అంత నా సీనియర్లదే. నాణ్యమైన జట్టు తరఫున మొదటి మ్యాచ్ ఆడడం అంత సులభం కాదు. ఈ విషయంలో ముంబై ఇండియన్స్ నాకు చాలా సహాయపడింది. మరొక చివరలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న సీనియర్ ఆటగాడు (విరాట్ కోహ్లీ) ఉన్నాడని తెలుసు. అయినా నేను మ్యాచ్ పూర్తి చేయాలనుకున్నా.. అలా జరగలేదు. కాస్త నిరాశ చెందాను. టామ్ కరన్ బౌలింగ్‌లో బాదిన సిక్సర్ ఎంతో ప్రత్యేకం. నేను ఈ అనుభూతిని మళ్లీ పొందుతానో లేదో తెలియదు (భారతదేశానికి అరంగేట్రం చేస్తున్నప్పుడు). కానీ నిజంగా గర్వంగా మరియు ఎంతో సంతోషంగా ఉంది' అని ఇషాన్‌ కిషన్ తెలిపాడు.

అవార్డు నాన్నకు అంకితం

అవార్డు నాన్నకు అంకితం

'నా కోచ్‌లు, సీనియర్లు మరియు ఇంతదూరం రావడానికి నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాపై నమ్మకం ఉంచిన ప్రతిఒక్కరికి నేనేంటో నిరూపించుకోవడానికి సమయం వచ్చింది. ఈ ఇన్నింగ్స్ నాలో ఉన్న పరుగుల దాహాన్ని చూపింది. నా కోచ్, నాన్న కొన్ని రోజుల క్రితం కన్నుమూశారు. నేను నాన్న కోసం కనీసం యాభై పరుగుల స్కోరు చేయాలనుకున్నా. ఈ ఇన్నింగ్స్, అవార్డు నాన్నకు అంకితం ఇస్తున్నా' అని మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.

హిట్టింగ్ చేస్తానని చెప్పేశాను

హిట్టింగ్ చేస్తానని చెప్పేశాను

'మ్యాచ్‌కి ముందే టీమిండియా మేనేజ్‌మెంట్‌కి ఓ విషయం చెప్పను. నేను ఓపెనర్‌గా ఆడతాను, ఐపీఎల్ తరహాలో స్వేచ్ఛగా హిట్టింగ్ చేస్తానని చెప్పేశాను. అందరూ మద్దతుగా నిలిచారు. ఫస్ట్‌ మ్యాచ్ కావడంతో కాస్త ఒత్తిడిగా అనిపించింది. కానీ టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ ఒత్తిడి కనిపించలేదు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశా. విరాట్ బయ్యా నిత్యం ఎంకరేజ్ చేశాడు' అని ఇషాన్ కిషన్ తెలిపాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య మంగళవారం రాత్రి 7 గంటలకి మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందులో కూడా ఇషాన్ కచ్చితంగా ఆడనున్నాడు.

45.76 స్ట్రైక్‌రేట్‌తో 516 పరుగులు:

45.76 స్ట్రైక్‌రేట్‌తో 516 పరుగులు:

ఝార్ఖండ్‌కు చెందిన ఇషాన్‌ కిషన్‌ ఎడమచేతివాటం వికెట్‌కీపర్‌ కమ్ బ్యాట్స్‌మన్‌. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రెండేళ్ల పాటు ముంబై ఇండియన్స్ తరఫున నిలకడగా పరుగులు చేస్తున్నాడు. నిర్భయంగా క్రికెట్‌ ఆడుతూ భారీ సిక్సర్లు బాదడం అతడి నైజం. రోహిత్ సారథ్యంలోని ముంబై వరుసగా రెండు ట్రోఫీలు గెలవడంలో కిషన్‌ పాత్ర ఎంతైనా ఉంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో కిషన్.. 145.76 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 516 పరుగులు చేశాడు. ఇందులో 36 ఫోర్లు, 30 సిక్సర్లు ఉండటం గమనార్హం.

India vs England: మ్యాచ్‌కి ముందు డివిలియర్స్‌తో ఛాట్ చేశా.. ఒకటే చెప్పాడు! హాఫ్ సెంచరీ బాదా: కోహ్లీ

Story first published: Monday, March 15, 2021, 12:39 [IST]
Other articles published on Mar 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+