
న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్, డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అనూహ్యంగా జట్టులోకి వచ్చి అసాధారణ ఇన్నింగ్స్‌తో చెలరేగిన ఇషాన్ ఇస్మార్ట్ ఇన్నింగ్స్‌కు దిగ్గజ క్రికెట్లతో పాటు అభిమానులు ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఈ జార్ఖండ్ డైనమైట్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కెరీర్‌లో తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలచిన ఇషాన్ ఇన్నింగ్స్‌ను ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. దిగ్గజ క్రికెట్ సచిన్ టెండూల్కర్ నుంచి సహచర ఆటగాళ్ల వరకు ప్రతీ ఒక్కరు ఇషాన్‌ను అభినందించారు.
అయితే ఒక్కరి పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అది ఎవరిదో కాదు.. ఇషాన్ కిషన్ ప్రియ సఖి అదితి హుండియా. ఇషాన్ ఇస్మార్ట్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన ఈ పిల్ల... ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇషాన్ కిషన్ కొనియాడింది. ఇషాన్ కిషన్ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న అదితి.. రెడ్ హార్ట్ ఎమోజీతో తన ప్రేమను చాటుకుంది. అతని స్పెషల్ ఇన్నింగ్స్‌కు సంబంధించి బీసీసీఐ చేసిన పోస్టును కూడా రీషేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ కాగా.. ఇషాన్- అదితి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
మిస్ ఇండియా ఫైనలిస్ట్ అయిన అదితి.. మోడల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇషాన్ కిషన్‌తో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఈ ఇద్దరు బాహటంగా కెమెరాలకు చిక్కారు. దాంతో ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు షికారు చేశాయి. అయితే, ఇషాన్ కిషన్ గానీ, అదితి గానీ తమ ప్రేమ బంధం గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు.
'అద్భుతమైన ఇన్నింగ్స్... నిన్ను ఎంత ప్రశంసించినా తక్కువే'అని క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కొనియాడగా.. టీమిండియాకు కావాల్సింది ఇలాంటి ఆటగాడే కదా అని వీరేంద్ర సెహ్వాగ్ మెచ్చుకున్నాడు. ఇక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇషూ నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇషాన్ ఇన్నింగ్స్‌ను మెచ్చుకున్నాడు.