For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: జాక్‌పాట్ ధర.. తెగ సంతోషపడుతున్న ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్!

 Ishan Kishan’s Girlfriend Aditi Hundia Reacts After Mumbai Indians Lap Him up For Rs 15.25 Crore
IPL Auction 2021 : Ishan Kishan జాక్ పాట్ ధర..గర్ల్ ఫ్రెండ్ హ్యాపీ | Mumbai Indians| Oneindia Telugu

బెంగళూరు: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌‌ పంట పండింది. రూ. 15.25 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇషాన్ కిషన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీ పడటంతో ఈ జార్ఖండ్ వికెట్ కీపర్‌కు జాక్ పాట్ ధర లభించింది. 2018 మెగా వేలంలో రూ.6 కోట్లకు తీసుకున్న ముంబై ఇండియన్స్.. మళ్లీ భారీ ధరకే సొంతం చేసుకుంది.

తనను మళ్లీ ముంబై ఇండియన్స్‌ తీసుకోవడంపై ఇషాన్ కిషన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఇషాన్ కిషన్ భారీ ధర పలకడంపై అతని గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చాలా గర్వంగా ఉందని కామెంట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

 Ishan Kishan’s Girlfriend Aditi Hundia Reacts After Mumbai Indians Lap Him up For Rs 15.25 Crore

ఇక అదితి హుండియాతో గత కొన్నాళ్లుగా ఇషాన్ కిషన్ డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ రూమర్లపై ఈ ఇద్దరూ అధికారికంగా స్పందించకపోయినప్పటికీ.. సోషల్ మీడియా వేదికగా ఒకరి పోస్ట్‌లకు మరొకరు స్పందించడంతో ఈ వార్తలకు బలం చేకూరుతుంది. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి మ్యాచ్‌లకు హాజరు కావడం.. ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌ను బాహటంగానే కొనియాడటంతో వీరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు అర్థమైంది.

ఇక ముంబై ఇండియన్స్ ఇంత ధర చెల్లించి ఓ ప్లేయర్‌ను వేలంలో తీసుకోవడం ఇదే తొలిసారి. గత 14 సీజన్లలో ఏనాడు కూడా ముంబై వేలంలో రూ.10 కోట్లు పైగా ఎవరికి ఖర్చు చేయలేదు. అయితే ఇషాన్ కిషన్‌కు అంత ధర చెల్లించడంపై ఆ జట్టు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

Story first published: Sunday, February 13, 2022, 13:35 [IST]
Other articles published on Feb 13, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+