Ishan Kishan: విండీస్ సిరీస్ నాకో గుణపాఠం.. అతని సలహాతోనే దుమ్మురేపా!

లక్నో: శ్రీలంకతో గురువారం జరిగిన తొలి టీ20లో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్(56 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 89) దుమ్మురేపాడు. దాంతో టీమిండియా 62 పరుగుల భారీ తేడాతో విజయాన్నందుకుంది. అయితే ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో 85 స్ట్రైక్‌రేట్‌తో కేవలం 71 పరుగులే చేసిన ఇషాన్ కిషన్.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే విండీస్‌తో జరిగిన సిరీస్ తనకు ఓ గుణపాఠమని ఇషాన్ కిషన్ తాజాగా వెల్లడించాడు. శ్రీలంకతో విజయానంతరం మీడియాతో మాట్లాడిన ఇషాన్.. తన ఆలోచన దృక్పథం సరిగ్గా లేకపోవడంతోనే విఫలమయ్యానని, సానుకూలంగా ఆలోచించలేకపోయానని చెప్పుకొచ్చాడు. దాన్ని కరెక్ట్ చేసుకొని శ్రీలంక సిరీస్‌లో రాణించానని తెలిపాడు.

నాకు ఓ గుణపాఠం..
మ్యాచ్‌కు శ్రేయస్ అయ్యర్‌తో మాట్లాడటం కూడా తనకు కలిసొచ్చిందని చెప్పాడు. 'వెస్టిండీస్ సిరీస్ వైఫల్యం నుంచి ఎంతో నేర్చుకున్నా. ఆ సిరీస్‌లో నా ఆలోచన దృక్పథం సరిగ్గా లేదు. సానుకూలంగా ఆలోచించలేకపోయాను. కానీ తాజా మ్యాచ్‌లో ఎక్కువగా ఆలోచించకుండా నా సహజశైలిలో ఆడాను. బంతిని చూసి షాట్స్ ఆడాను. పుల్ షాట్ నాఫేవరేట్. ఆ షాట్‌ను బాగా ఆస్వాదిస్తాను.

శ్రేయస్‌తో మాట్లాడుతాను..
బ్యాటింగ్ యూనిట్‌గా ఇదో సానుకూలాంశం. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో గ్యాప్ షాట్లు ఆడటం నేర్చుకోవాలి. మిడ్ వికెట్ రిజియన్‌లో ఎలా ఆడాలనేదానిపై శ్రేయస్ అయ్యర్‌తో మాట్లాడాను. బంతి మిడిల్ చేస్తే బౌండరీ వస్తదని, గ్యాప్ షాట్స్ ఆడితే డబుల్స్ వస్తాయని చెప్పాడు. నేను నా స్టైల్లో ఆడాను'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ఇషాన్ కిషన్ తెలిపాడు.

ఏ స్థానంలోనైనా రెడీ..
'టీమిండియాకు ఆడుతున్న సమయంలో వచ్చిన ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకోవడమే ముఖ్యం. జట్టులో ఇతర ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నపుడు కచ్చితంగా పోటీ ఉంటుంది. అలాంటప్పుడు కచ్చితంగా నేను ఈ స్థానంలోనే ఆడాలి అనుకోవడం సరికాదు. నెట్స్‌లో సీనియర్లను గమనిస్తూ.. వాళ్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలి. వాళ్ల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది'' అని ఇషాన్ చెప్పుకొచ్చాడు.

శ్రీలంక చిత్తు..
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 89) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 నాటౌట్), రోహిత్ శర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 44) మెరుపులు మెరిపించారు. అనంతరం శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చరిత్ అసలంక (47 బంతుల్లో 5 ఫోర్లతో 53 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, వెంకటేశ్ అయ్యర్ రెండేసి వికెట్లు తీయగా.. జడేజా, చాహల్ చెరొక వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications