నేనే ఓపెనర్ అని ఈ మ్యాచ్‌కు ముందే చెప్పారు: ఇషాన్ కిషన్
Ishan Kishan: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమిండియాకు అదిరిపోయే ప్రాక్టీస్ లభించింది. సౌతాఫ్రికాతో నవీ ముంబై వేదికగా బుధవారం జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 30 పరుగుల తేడాతో గెలుపొందింది. మరోసారి ఇషాన్ కిషన్(20 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 53)విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు.
ఈ మ్యాచ్‌లో అతను ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. తిలక్ వర్మ రీఎంట్రీ ఇవ్వడంతో ఇషాన్ కిషన్‌కు ఓపెనర్‌గా ప్రమోషన్ దక్కగా.. సంజూ శాంసన్ తుది జట్టులో చోటు కోల్పోయాడు. టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలోనూ టీమిండియా ఇదే కాంబినేషన్‌ను కొనసాగించనుంది.
అయితే ఈ వార్మప్ మ్యాచ్‌కు ముందే తాను ఓపెనింగ్ చేయబోతున్నట్లు టీమిండియా మేనేజ్‌మెంట్ తెలిపిందని ఇషాన్ కిషన్ అన్నాడు. ఈ మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన ఇషాన్ కిషన్.. పిచ్, బౌన్స్‌ను నమ్మి షాట్లు ఆడానని తెలిపాడు.

'ఈ వార్మప్ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేయబోతున్నట్లు నాకు ఒక రోజు ముందే తెలిసింది. ప్రస్తుత క్షణంలో ఉండటం, బంతిని గమనిస్తూ అవసరమైన షాట్లు ఆడటం, సరైన మానసిక స్థితిని కలిగి ఉండటం, బంతిని నిశితంగా చూడటం నా బ్యాటింగ్ శైలి. నేను కేవలం వికెట్, బౌన్స్‌ను నమ్మి ఆడాను. ఈ వికెట్‌పై మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆటను మెరుగుపర్చుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(20 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. తిలక్ వర్మ(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) తన జోరు కొనసాగించగా.. అక్షర్ పటేల్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) దూకుడుగా ఆడాడు.
అనంతరం సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఎయిడెన్ మార్క్‌రమ్(19 బందుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38), ర్యాన్ రికెల్టన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), జాసన్ స్మిత్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35), ట్రిస్టన్ స్టబ్స్(21 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 45 నాటౌట్), మార్కో జాన్సెన్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) రాణించారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ(2/32) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరంగా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications