టీమిండియా విధ్వంసకర బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు ఆఫ్ స్పిన్ బౌలింగ్ సవాల్‌గా మారింది. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్.. ఆఫ్ స్పిన్ బౌలర్లకు మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. దాంతో ఇషాన్ కిషన్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యర్థి జట్లు ఆఫ్ స్పిన్ బౌలర్లను అస్త్రంగా ఉపయోగిస్తున్నాయి. పవర్ ప్లేలోనే ఆఫ్ స్పిన్ బౌలర్లతో బౌలింగ్ చేయిస్తున్నాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ఇషాన్ కిషన్.. 6 మ్యాచ్‌ల్లో ఐదు సార్లు ఆఫ్ స్పిన్నర్‌కే ఔటయ్యాడు. నమీబియాతో మ్యాచ్‌లో ఎరాస్మస్ బౌలింగ్‌లో.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సైమ్ అయూబ్ బౌలింగ్‌లో వెనుదిరిగిన ఇషాన్ కిషన్.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆర్యన్ దత్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో మార్క్‌రమ్ బౌలింగ్‌లో .. జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ ఆఫ్ స్పిన్నర్ అయిన సికందర్ రజా బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.

ఇటీవల ఇషాన్ కిషన్ మొత్తం 10 సార్లు ఆఫ్ స్పిన్నర్‌కు ఔటయ్యాడు. ఇతర బౌలర్లతో పోలిస్తే ఆఫ్ స్పిన్నర్లపై ఇషాన్ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా బంతిని లోపలికి వేసే ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇషాన్ డాట్ బాల్స్ ఎక్కువగా ఆడుతున్నాడు.
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు ఆఫ్ స్పిన్నర్లు సహజంగానే సవాలు విసురుతారు. ఇషాన్ కిషన్ ఎక్కువగా 'వైడ్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్' వచ్చే బంతులను ఆడే క్రమంలో లేదా స్పిన్ అవుతున్న బంతిని డ్రైవ్ చేయబోయి క్యాచ్ ఇచ్చి ఔటవుతున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో కూడా ఇషాన్ కిషన్ ఆఫ్ స్పిన్నర్లకు 14 సార్లు ఔటయ్యాడు. దాంతోనే ఇషాన్‌కు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థి జట్లు ఆఫ్ స్పిన్నర్లను బరిలోకి దించుతున్నాయి.
ఇషాన్ కిషన్‌తో పాటు అభిషేక్ శర్మ కూడా లెఫ్టార్మ్ బ్యాటర్ కావడంతో ప్రత్యర్థి జట్లు తొలి ఓవర్‌ను కూడా ఆఫ్ స్పిన్నర్లతోనే వేయిస్తున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించింది. ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్‌కు డిమోట్ చేసింది. ఈ వ్యూహాత్మక మార్పు ఫలించడంతో ఇదే ఫార్మూలాను టీమిండియా కొనసాగించనుంది.
అయితే ఇషాన్ కిషన్ వీలైనంత త్వరగా ఆఫ్ స్పిన్ బలహీనతను అధిగమించుకోవాలని, లేదంటే కష్టమవుతుందని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సాంకేతిక అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఆటగాళ్ల బలహీనతలను కనిపెట్టడం ప్రత్యర్థులకు కష్టం కాదని, వీలైనంత త్వరగా సమస్యను అధిగమించాలని సూచిస్తున్నారు. లేదంటే కెరీర్‌లో కొనసాగలేడని చెబుతున్నారు.