IPL 2022: ఇషాన్ కిషన్‌కు అన్యాయం.. మార్కీ ప్లేయర్స్ జాబితాలో దక్కని చోటు! భారీ ధర కష్టమే!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా జరిగే వేలంలో ఉన్న క్రికెటర్ల తుది జాబితాను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. 1258 మంది ఆటగాళ్లు మెగా వేలానికి రిజిస్టర్ చేసుకోగా అందులో నుంచి బీసీసీఐ 590 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. అయితే ఈ మెగా వేలంలో భారత యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్‌కు అన్యాయం జరుగుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. లెఫ్టార్మ్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్, హిట్టింగ్ సామర్థ్యం ఉన్న నేపథ్యంలో ఇషాన్ కిషన్‌కు భారీ ధర పలికే చాన్సుందని అంతా భావించారు. కానీ బీసీసీఐ చేసిన పని వల్ల ఇషాన్‌కు భారీ నష్టం జరగనుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అసలేం జరిగిందంటే..?
బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన 590 మంది ఆటగాళ్ల నుంచి 10 మందిని అత్యంత ప్రాధాన్య ఆటగాళ్ల జాబితా(మార్కీ లిస్ట్)లో చేర్చింది. భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, సౌతాఫ్రికా లెజెండ్ క్వింటన్ డికాక్, ఫాఫ్ డుప్లెసిస్, టీమిండియా యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్, సౌతాఫ్రికా పేస్ దిగ్గజం కగిసో రబడా, టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, డేవిడ్ వార్నర్, ట్రెంట్ బౌల్ట్ ఈ ప్రాధాన్య ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకోగా.. ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కలేదు. ఇదే మెగా వేలంలో అతని కొంపముంచనుంది.

వికెట్ కీపర్ల జాబితాలో...
ఏ ప్రాతిపాదికన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ మార్కీ ప్లేయర్స్ లిస్ట్‌ను తయారు చేసిందో తెలియదు కానీ.. ఇషాన్ కిషన్‌కు చోటు దక్కకపోవడంతో అతను వికెట్ కీపర్ల జాబితాలో ఉన్నాడు. నిబంధనల ప్రకారం మొదట ఈ మార్కీ ప్లేయర్స్ వేలంలోకి రానున్నారు. ఆ తర్వాత క్యాప్‌డ్(జాతీయ జట్టు తరఫున ఆడినవారు) ప్లేయర్స్‌లోని బ్యాట్స్‌మన్, ఆల్‌రౌండర్స్, వికెట్ కీపర్స్, పేసర్లు, స్పిన్నర్లు ఇలా వరుస క్రమంలో వేలానికి వస్తారు. ఆ తర్వాత అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ కూడా ఇదే వరుస క్రమంలో వేలం వేస్తారు. అయితే ఈ లెక్కన వికెట్ కీపర్స్ జాబితా వచ్చే సరికి ఫ్రాంచైజీల వద్ద ఉన్న డబ్బు దగ్గరపడే అవకాశం ఉంది. అప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

రూ.10 కోట్లు కష్టమే..
వేలంలో ముందుగా వచ్చే ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే చాన్సుంది. ఈ లెక్కన ఇషాన్ కిషన్ సాధారణ ధరనే పలకనున్నాడు.
వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో పాటు హిట్టింగ్ సామర్థ్యం ఉండటం, టీమ్ భవిష్యత్తు దృష్ట్యా అతను కెప్టెన్సీకి కూడా పనికొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇషాన్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతాయని అంతా భావించారు. ఈ క్రమంలోనే రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఇషాన్.. రూ.17 కోట్లు పలుకుతాడని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతను రూ.10 కోట్లు పలకడం కూడా కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ముంబై ఇండియన్స్ లక్కీ..
బీసీసీఐ చేసిన పనితో ముంబై ఇండియన్స్‌కు కలిసిరానుంది. ఇషాన్ కిషన్‌ను తక్కువ ధరకే ముంబై ఇండియన్స్ దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మార్కీ లిస్ట్‌లో ఇషాన్ కిషన్ లేకపోవడంతో శ్రేయస్ అయ్యర్‌కు కలిసి రానుంది. అతని కోసం ఫ్రాంచైజీలు మరింత ఎక్కువ చెల్లించే చాన్స్ ఉంది. డేవిడ్ వార్నర్, కగిసో రబడా, ప్యాట్ కమిన్స్‌లు కూడా భారీ ధర పలికే చాన్సుంది. అశ్విన్, డికాక్, డుప్లెసిస్, షమీ, బౌల్ట్‌లు ఉన్నా వారికి మోస్తరు ధరకే ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి. మొత్తానికి బీసీసీఐ చేసిన పని ఇషాన్ కిషన్‌కు తీవ్రని నష్టం తీసుకురానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications