Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ishan Kishan డబుల్.. రికార్డులన్నీ బద్దల్! వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలి బ్యాటర్‌గా..

Ishan Kishan joins elite list with his fastest double century in ODIs

ఛటోగ్రామ్: బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్(131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210) డబుల్ సెంచరీ నమోదు చేశాడు. కెరీర్‌లో సాధించిన తొలి సెంచరీనే డబుల్‌గా మలిచాడు. ఈ అసాధారణ ఇన్నింగ్స్‌తో ఇషాన్ అరుదైన ఘనతలను అందుకున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు.

ముస్తాఫిజుర్ అహ్మద్ వేసిన 35వ ఓవర్‌లో క్విక్ సింగిల్‌తో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న ఇషాన్ 126 బంతుల్లో‌నే ఈ ద్విశతకాన్ని సాధించాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డులను బద్దలు కొట్టాడు. గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించగా.. సెహ్వాగ్ 140 బంతుల్లో ఈ మార్క్ అందుకున్నాడు. ఇప్పటి వరకు ఇవే ఫాస్టెస్ట్ డబుల్ హండ్రెడ్స్‌గా ఉండగా.. ఇషాన్ కిషన్ 126 బంతులతో అధిగమించాడు.

అంతేకాకుండా వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. షేన్ వాట్సన్ పేరిట ఉన్న రికార్డును అతను అధిగమించాడు. డబుల్ సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడు కూడా ఇషాన్ కిషనే కావడం గమనార్హం. టీమిండియా తరఫున డబుల్ సెంచరీ సాధించిన నాలుగో బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. ఇషాన్ కన్నా ముందు సచిన్, సెహ్వాగ్, రోహిత్ వన్డేల్లో ద్విశతకాలు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇందులో రొహిత్ ఒక్కడే మూడు ద్విశతకాలు బాదగా.. సచిన్, సెహ్వాగ్, ఇషాన్ తలో డబుల్ సెంచరీ నమోదు చేశారు. డబుల్ సెంచరీ బాదిన తొలి లెఫ్టార్మ్ ఇండియన్ బ్యాటర్ కూడా ఇషాన్ కిషానే కావడం విశేషం. అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన టీమిండియా వికెట్ కీపర్‌గా కూడా ఇషాన్ గుర్తింపు పొందాడు. మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న(183) రికార్డును తాజా ఇన్నింగ్స్‌తో ఇషాన్ అధిగమించాడు. అసలు జట్టులో చొటిస్తారో లేదో తెలియని పరిస్థితుల్లో దూసుకొచ్చిన ఇషాన్ కిషన్.. చిచ్చర పిడుగులా బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బంగ్లాదేశ్‌పై అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా కూడా ఇషాన్ గుర్తింపు పొందాడు. ఇషాన్ డబుల్‌కు విరాట్ కోహ్లీ సెంచరీ కూడా తోడవడంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

Story first published: Saturday, December 10, 2022, 15:12 [IST]
Other articles published on Dec 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+