ఇషాన్ కిషన్ విధ్వంసం.. వరుస సిక్సర్లతో శతకం! (వీడియో)
టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(107 బంతుల్లో 5 ఫోర్లు,10 సిక్సర్లతో 114) దుమ్మురేపాడు. తమిళనాడు వేదికగా జరుగుతున్న బుచ్చి బాబు టోర్నీలో సెంచరీతో సత్తా చాటాడు. ఈ టోర్నీలో జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఇషాన్ కిషన్.. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 86 బంతుల్లో సెంచరీ సాధించాడు.
92 పరుగుల వద్ద వరుసగా రెండు సిక్స్‌లు బాది తనదైన శైలిలో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 10 సిక్స్‌లు బాదడం విశేషం. ప్రస్తుతం అతని సెంచరీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత ఇషాన్ కిషన్ ఆడుతున్న తొలి ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ ఇదే. గతంలో దేశవాళీ క్రికెట్ ఆడకుండా బీసీసీఐ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్ట్‌తో పాటు భారత జట్టులో చోటు కోల్పోయాడు. వచ్చే 4 నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుండటంతో భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఇషాన్ కిషన్ కష్టపడుతున్నాడు.
ఈ క్రమంలోనే అతను దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న బుచ్చి బాబు టోర్నీతో పాటు సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపర్‌గానూ ఇషాన్ కిషన్ సత్తా చాటాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్య ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 91.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జార్ఖండ్ 84 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. క్రీజులో రవి యాదవ్(11 బ్యాటింగ్), మనిషి(7 బ్యాటింగ్) కొనసాగుతున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ 52 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది.
Ishan Kishan hits a century in his comeback match! Well done Skip! pic.twitter.com/aRBnCZgRsI
— kryptonite✨ (@ish_mania) August 16, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications