For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: బంతి ఎక్కడ పడినా.. తొలి బంతికే సిక్సర్ కొడతానని సవాల్ చేసిన టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌!

Ishan Kishan Has Told Everyone He Will Hit A Six On 1st Ball Before India vs Sri Lanka 1st ODI
Ind Vs SL : Ishan kishan Confidence Level, Reveals His Strategy On Debut | Oneindia Telugu

కొలంబో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దుమ్మురేపిన ముంబై ఇండియన్స్ యువ బ్యాట్స్‌మన్‌ ఇషాన్ కిష‌న్‌.. ఈ ఏడాదే భారత జట్టులో అరంగేట్రం చేశాడు. గత మర్చిలో ఇంగ్లండ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేసిన ఇషాన్.. ఆదివారం శ్రీలంకతో జ‌రిగిన మ్యాచ్‌లో వ‌న్డేల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. టీ20, వన్డే ఫార్మాట్లలో అరంగేట్రంలోనే హాఫ్‌ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు.

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడిన ఇషాన్ (56: 32 బంతుల్లో 5x4, 4x6) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా.. శ్రీలంకతో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగి (34 బంతుల్లో 53; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో చెలరేగాడు.

ముందే చెప్పి.. తొలి బంతికే సిక్స్

ముందే చెప్పి.. తొలి బంతికే సిక్స్

అయితే తొలి వన్డేలో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ కొడతానని భారత డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతి ఒక్కరికీ ఇషాన్ కిష‌న్‌ చెప్పాడట. బంతి ఎక్కడ పడినా.. తొలి బంతికే సిక్సర్ కొడతానని చెప్పిమరీ మైదానంలోకి దిగాడట. చేపినట్టే తాను ఎదుర్కొన్న తొలి బంతిని మైదానం బయటకు ఇషాన్ పంపాడు. ధనంజయ్ డిసిల్వా వేసిన 6వ ఓవర్ మూడో బంతికి పృథ్వీ షా ఔట్ కాగా.. ఆ తర్వాతి బంతినే ఇషాన్ సిక్స్ బాదాడు. శతకొట్టేలా కనిపించిన ఇషాన్‌ (42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సందకన్‌ బౌలింగ్‌లో భానుకకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

అరుదైన ఘనత

అరుదైన ఘనత

వన్డే కెరీర్‌ను సిక్స్‌, బౌండరీతో ప్రారంభించిన జార్ఖండ్ కుర్రాడు ఇషాన్ కిష‌న్‌ .. 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో ఇషాన్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రం వన్డేలో అతి తక్కువ బంతుల్లో(33) ఫిఫ్టి సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో కృనాల్‌ పాండ్యా తన అరంగేట్రం మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. రోలాండ్ బుట్చేర్, జాన్ మోరిస్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Tokyo Olympics 2021: కొత్తగా నాలుగు ఆటలు.. బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్‌ క్రీడలు పునరాగమనం!!

క్లీన్ షేవ్ చేసుకున్న విరాట్ కోహ్లీ

క్లీన్ షేవ్ చేసుకున్న విరాట్ కోహ్లీ

ఇక కొలంబోలోని ప్రేమదాస మైదానంలో ఇషాన్ కిష‌న్‌ను చూసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. కిష‌న్‌ను సడెన్‌గా చూస్తే.. విరాట్ కోహ్లీ ఏంటి ఇక్క‌డ ఉన్నాడు అనిపించ‌క మాన‌దు. కొంద‌రైతే ఇత‌డు క్లీన్ షేవ్ చేసుకున్న విరాట్ కోహ్లీ అంటూ సోష‌ల్ మీడియాలో ఫొటోలను వైర‌ల్ చేశారు. 23 ఏళ్ల ఇషాన్ అచ్చం కోహ్లీని త‌ల‌పిస్తున్నాడంటూ ట్విట‌ర్‌లో కామెంట్ చేస్తున్నారు. మ‌రికొంద‌రైతే హెల్మెట్ పెట్టుకుంటే దక్షిణాఫ్రికా వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డీకాక్‌లా క‌నిపిస్తున్నాడ‌ని పోస్టులు చేశారు. ఆదివారం అత‌ని బ‌ర్త్‌డే కూడా. హాఫ్ సెంచరీ చేసి ఆ రోజును మరింత ప్రత్యేకంగా మలుచుకున్నాడు.

14 మ్యాచ్‌ల్లో 516 పరుగులు

14 మ్యాచ్‌ల్లో 516 పరుగులు

ఇషాన్‌ కిషన్‌ 2020 ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున 14 మ్యాచ్‌ల్లో 516 పరుగులు సాధించాడు. ఆపై విజయ్‌ హజారే ట్రోపీలో ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన ఇషాన్‌.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. మొదటి టీ20లో విఫలమైన శిఖర్‌ ధావన్‌ స్థానంలో రెండో టీ20లో ఇషాన్‌ అడుగుపెట్టాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 56 పరుగులు చేశాడు. టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఇషాన్‌.. తన ఆరంభ మ్యాచ్‌లోనే 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్'‌గా నిలవడం విశేషం. అనంతరం ఐపీఎల్ 2021లో చెలరేగడంతో.. శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు.

Story first published: Monday, July 19, 2021, 12:29 [IST]
Other articles published on Jul 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+