IND vs AFG: కోహ్లీ స్థానంలో దేవుడి బిడ్డ.. జైస్వాల్‌కు నో ఛాన్స్!
అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో చివరి నిమిషంలో ఈ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయిన సంగతి తెలిసిందే. దాంతో అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌ను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. అయితే విరాట్ కోహ్లీ స్థానంలో దేవుడి బిడ్డ అయిన ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడని, యశస్వి జైస్వాల్‌కు తుది జట్టులో అవకాశం దక్కదని మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా అన్నాడు.
శనివారం ధర్మశాల వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. టీమిండియా తుది జట్టు ఎంపికపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా..ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేసినా.. తుది జట్టులో ఇషాన్ కిషన్‌ను ఆడించాలని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

'టీమిండియాలో ఇషాన్ కిషన్ దేవుడి బిడ్డ. అనుకోకుండా అవకాశం వచ్చిన ప్రతీసారి అతను సత్తా చాటాడు. వన్డే సిరీస్‌లో అతను గనుక మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తే కచ్చితంగా పరుగులు చేస్తాడు. ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.'అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.
బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయి భారత జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ అనూహ్యంగా రీఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్‌గా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌కు తొలి టైటిల్ అందించాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ 2026లో సత్తా చాటాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ చెలరేగాడు. మరోవైపు రిషభ్ పంత్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుండగా.. ఇషాన్ కిషన్ మాత్రం రీఎంట్రీలో సత్తా చాటుతున్నాడు.
ఇప్పటి వరకు 27 వన్డేలు ఆడిన ఇషాన్ కిషన్ 42.40 సగటుతో 933 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌పై అతను చేసిన 210 పరుగులే అతని అత్యధిక స్కోర్.
ఆకాష్ చోప్రా భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications