అందుకే మా మ్యాచ్ విన్నర్‌ను పక్కనపెట్టాం: ఇషాన్ కిషన్
వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిపించిన యువ పేసర్ ప్రఫుల్ హింగేపై సన్‌రైజర్స్ హైదరాబాద్ వేటు వేసింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్రఫుల్ హింగే, లివింగ్ స్టోన్‌లను తుది జట్టు నుంచి తప్పించి ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ లిస్ట్‌లో చేర్చింది.
పిచ్ స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తెలిపాడు. ఎక్కువ స్పిన్ ఆప్షన్స్ కోసం ప్రఫుల్ హింగేను పక్కనపెట్టామని చెప్పాడు. దిల్షాన్ మదుషంక తుది జట్టులోకి వచ్చాడని ఇషాన్ కిషన్ తెలిపాడు. అయితే ప్రఫుల్ హింగే, మదుషంకలో ఒకరే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతారని చెప్పాడు.
స్పిన్నర్ల కోసమే..
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. టాస్ సందర్భంగా మాట్లాడిన ఇషాన్ కిషన్.. గత మ్యాచ్‌లతో పోల్చితే ఇది భిన్నమైన వికెట్ అని తెలిపాడు. 'ఈ పిచ్‌పై ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేం. ఎందుకంటే గత కొన్ని మ్యాచ్‌ల్లో మేం ఆడిన వికెట్ లాగా ఇది లేదు. పిచ్ కండిషన్స్ బట్టి ఆడాల్సి ఉంది. ఈ రోజు మా తుది జట్టులో కొన్ని మార్పులు ఉన్నాయి, మధుషంక బరిలోకి దిగుతుండగా.. ప్రఫుల్ హింగే బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఈ విషయంపై నాకు క్లారిటీ లేదు.

హర్ష్‌దూబే తిరిగి జట్టులోకి వచ్చాడు. ఎందుకంటే ఇది కొంచెం స్లో ట్రాక్. వికెట్లు తీయడానికి మాకు స్పిన్ ఆప్షన్ ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. మా కుర్రాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఫలితాలను చూసి ఈ మాట చెప్పడం లేదు. మా ప్రణాళికలను వారు అమలు చేస్తున్న విధానం, వారి మనస్థత్వం చూసి ఈ మాట అంటున్నా.
ఏ కెప్టెన్ అయినా తమ యువ బౌలర్ల నుంచి ఆశించేది ఇదే. కాబట్టి మేం ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడతాం. వారు తమ ప్రణాళికలను అమలు చేస్తూనే ఉంటారని నేను భావిస్తున్నా.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
100 మ్యాచ్‌లు ఊహించలేదు..
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ విషయంలో తమకు అదృష్టం కలిసి వస్తుందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 100 మ్యాచ్‌లు ఆడుతానని అనుకోలేదని, ఈ రోజు విజయం దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నానని వెల్లడించాడు. తమ తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన అక్షర్ పటేల్.. ఆకీబ్ స్థానంలో నితీష్ రాణా బరిలోకి దిగుతున్నాడని తెలిపాడు.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సంక, కె.ఎల్. రాహుల్(w), సమీర్ రిజ్వీ, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి నటరాజన్, లుంగీ ఎన్గిడి
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(c), హెన్రిచ్ క్లాసెన్, సలిల్ అరోరా(w), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ఈషాన్ మలింగ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications