For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 19 ఏళ్ల తర్వాత..!

టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ తర్వాత పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ చరిత్రకెక్కాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో 77 పరుగులు చేయడం ద్వారా ఇషాన్ కిషన్ ఈ ఫీట్ సాధించాడు.

బ్యాటింగ్‌కు ప్రతికూలమైన ఈ వికెట్‌పై దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. గత 19 ఏళ్లలో ఏ భారత ఓపెనర్‌ కూడా పాకిస్థాన్‌పై టీ20 ప్రపంచకప్‌లో హాఫ్ సెంచరీ సాధించలేదు.

చివరిసారిగా 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ ఓపెనర్‌గా వచ్చి పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ (75 పరుగులు) సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ భారత ఓపెనర్‌కు హాఫ్ సెంచరీ సాధించలేదు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగినా పాకిస్థాన్‌పై 50 పరుగులు చేయలేకపోయారు.

Ishan Kishan Creates History Becomes First Indian Opener Since 2007 to Score T20I Fifty vs Pakistan

ఒకవైపు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయి ఒత్తిడిలో ఉన్న సమయంలో, ఇషాన్ కిషన్ అత్యంత బాధ్యతాయుతంగా ఆడి ఈ మైలురాయిని చేరుకున్నాడు. రెండో వికెట్‌కు తిలక్ వర్మతో కలిసి 87 పరుగులు జోడించాడు. ఇందులో ఇషాన్ కిషన్‌వే 77 పరుగులు కావడం గమనార్హం.

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తర్వాత ఈ ఫీట్ సాధించిన ఇషాన్ కిషన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గురువు రికార్డ్‌ను సమం చేయడమే కాకుండా భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడని కొనియాడుతున్నారు. ఇషాన్ బ్యాటింగ్‌కు పాక్ బౌలర్లు పరేషాన్ అయ్యారని కామెంట్ చేస్తున్నారు.

భారత్-పాక్ టీ20ల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీలు (బంతుల వారీగా):

23 - మొహమ్మద్ హఫీజ్, అహ్మదాబాద్ 2012

24 - అభిషేక్ శర్మ, దుబాయ్ 2025

27 - ఇషాన్ కిషన్, కొలంబో RPS 2026 *

29 - యువరాజ్ సింగ్, అహ్మదాబాద్ 2012

భారత్-పాక్ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:

82* - విరాట్ కోహ్లీ, మెల్బోర్న్ 2022

79* - మొహమ్మద్ రిజ్వాన్, దుబాయ్ 2021

78* - విరాట్ కోహ్లీ, కొలంబో RPS 2012

77 - ఇషాన్ కిషన్, కొలంబో RPS 2026

Story first published: Sunday, February 15, 2026, 20:21 [IST]
Other articles published on Feb 15, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+