Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs SRH: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారథ్యం వహించిన అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌‌తో ఇషాన్ కిషన్ ఈ ఫీట్ సాధించాడు.

రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్ను గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడంతో తాత్కలిక సారథిగా ఇషాన్ కిషన్ బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌సీబీతో తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్.. శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఇషాన్ కిషన్ కంటే ముందు శిఖర్ ధావన్, మనీష్ పాండే, భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహించారు. ఆరెంజ్ ఆర్మీకి సారథ్యం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా కేన్ విలియమ్సన్ కొనసాగుతున్నాడు.

Ishan Kishan creates history as SRH s youngest Indian captain breaking Shikhar Dhawan s record

ఐపీఎల్ 2018 సీజన్‌లో కేన్ విలియమ్సన్ 27 ఏళ్ల 244 రోజుల వయసులో సన్‌‌రైజర్స్ హైదరాబాద్ సారథ్య బాధ్యతలు చేపట్టగా.. ఇషాన్ కిషన్ 27 ఏళ్ల 253 రోజుల వయసులో ఈ ఫీట్ అందుకున్నాడు. 2018లో కేన్ విలియమ్సన్ సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ ఇషాన్ కిషన్ నిలిచాడు. ఈ క్రమంలో అతను మనీష్ పాండే రికార్డును అధిగమించాడు. 2021లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా మనీష్ పాండే తన తొలి మ్యాచ్‌లో 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అతన్ని అధిగమించాడు.

80 (38) - ఇషాన్ కిషన్ వర్సెస్ ఆర్సీబీ, బెంగళూరు, 2026*
69 (41) - మనీష్ పాండే వర్సెస్ ఎంఐ, అబుదాబి, 2021*
53 (42) - డేవిడ్ వార్నర్ వర్సెస్ సీఎస్‌కే, చెన్నై, 2015

ఇషాన్ విధ్వంసం

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(7), ట్రావిస్ హెడ్(11), నితీష్ కుమార్ (1) విఫలమవ్వగా.. హెన్రీచ్ క్లాసెన్‌(31)తో కలిసి ఇషాన్ కిషన్ ఆదుకున్నాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్(80).. ఫిల్ సాల్ట్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా ఇషాన్ కిషన్.. ఐపీఎల్‌లో 3 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఆర్‌సీబీ అరంగేట్ర పేసర్ జాకోబ్ డఫీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్-3 బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు.

Story first published: Saturday, March 28, 2026, 21:07 [IST]
Other articles published on Mar 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+