ఇషాన్ కిషన్ గురించి ధోనీ అప్పుడే చెప్పాడు: చిన్న నాటి కోచ్

హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్, డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన మూడో వన్డేలో ఇషాన్ కిషన్ ద్విశతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాది అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇక ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీపై అతని చిన్ననాటి కోచ్, మాజీ రంజీ ప్లేయర్ ఉత్తమ్ మజుందార్ సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా తరఫున ఆడకముందే ఇషాన్ ప్రతిభను మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గుర్తించాడని తెలిపాడు. ఇషాన్ కిషన్ సూపర్ డబుల్ సెంచరీ నేపథ్యంలో ఓ చానెల్‌తో మాట్లాడిన మజుందార్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ధోనీ అప్పుడే చెప్పాడు
'ఇషాన్ కిషన్ భారత్ తరఫున అరంగేట్రం చేయడానికి ముందే ధోనీ అతని ప్రతిభ గురించి మాట్లాడారు. ఇషాన్ కిషన్ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడు దేశం తరఫున ఎక్కువ కాలం ఆడకపోతే.. తనకు తానే అన్యాయం చేసుకున్నట్టు'అని ధోనీ అన్నాడని మజుందార్ గుర్తు చేసుకున్నాడు.
ఇషాన్ అన్నయ్య రాజ్ కిషాన్ కూడా ఎంతో ప్రతిభావంతుడైన క్రికెటరేనన్న మజుందార్.. మెడిసిన్ చదవడం కోసం అతను క్రికెట్‌ను వదిలేశాడని తెలిపాడు.'ఇషాన్ తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఒకర్ని క్రీడలవైపు, మరొకర్ని చదువువైపు మళ్లించాలని భావించారు. దాంతో రాజ్ కిషన్ మెడికల్ డిగ్రీ కోసం క్రికెట్‌ను త్యాగం చేశాడు.'అని మజుందార్ చెప్పుకొచ్చాడు.

6 ఏళ్ల వయసులోనే కవర్ డ్రైవ్..
కోచ్‌గా మారక ముందు ఉత్తమ్ మజుందార్ బిహార్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. బిహార్ రంజీ జట్టు సభ్యుడిగా అతనికి ధోనీతో మంచి స్నేహం ఉంది. రంజీ క్రికెట్ ఆడే సమయంలో ఈ ఇద్దరూ కలిసి ఒకే రూమ్‌లో ఉన్నారు. 'ఇషాన్ ట్రైనింగ్‌కు వచ్చిన తొలి రోజు ఎంతో చిన్నగా ఉన్నాడు. అతనికి అండర్ ఆర్మ్ బాల్స్ వేయగా.. పర్ఫెక్ట్‌గా కవర్ డ్రైవ్స్ ఆడాడు. ఆరేళ్ల పిల్లాడు అలా కవర్ డ్రైవ్స్ ఆడటం చూశాక.. మీ అబ్బాయి స్పెషల్ అని.. భారత్ తరఫున అతను ఆడలేకపోతే దురదృష్టకరమని ప్రణవ్ జీతో చెప్పాను.

రోజు 200 బంతులు..
ఇవాళ ఇషన్ కిషన్ బాదిన పది సిక్స్‌లు చూశారు. అతడెంత బలంగా బంతిని బాది ఉంటాడనే విషయాన్ని మీరు గ్రహించి ఉంటారు. ఇది రాత్రికి రాత్రే జరగలేదు. ఇందుకోసం నెలల తరబడి రోజకు రెండు సెషన్ల చొప్పున ఇషాన్ సాధన చేశాడు. ప్రతి రోజూ నెట్స్‌లో కనీసం 500 నుంచి 600 బంతులను ఎదుర్కొన్నాడు. అందులో 200 బంతులను పవర్ హిట్టింగ్ చేయడంపైనే ఫోకస్ పెట్టాడు'అని మజుందార్ చెప్పుకొచ్చాడు.

ఇషాన్‌దార్ ఇన్నింగ్స్..
రోహిత్ శర్మ గాయపడటంతో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. రాక రాక వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్స్‌లతో 210 పరుగులు చేశాడు. ఇషాన్ విధ్వంసంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేయగలిగింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 34 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో టీమిండియా 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications