Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH జట్టులోనే.. నువ్వు ఓ బిగ్గెస్ట్ ఫ్రాడ్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌పై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్రలోనే ఇషాన్ కిషన్ ఓ బిగ్గెస్ట్ ఫ్రాడ్ అని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యాడు. 3 బంతులాడి 2 పరుగులే చేసి వెనుదిరిగాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో విల్ జాక్స్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. ఇషాన్ కిషన్ వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించింది. దాంతో ఇషాన్ కిషన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇషాన్ కిషన్.. మరో హ్యారీ బ్రూక్‌లా తయారయ్యాడని మండిపడుతున్నారు. గతంలో హ్యారీ బ్రూక్ సైతం ఒకే ఒక్క సెంచరీ నమోదు చేసి మిగతా మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా ఈ సీజన్‌‌ను భారీ శతకంతో ప్రారంభించి తర్వాతి మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు.

Ishan Kishan brutally trolled after another flop in MI vs SRH IPL 2025 clash

ఒక్కో పరుగుకు రూ. 8.20 లక్షలు..
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్.. వరుసగా 106*, 0, 2, 2, 17, 9*, 2 పరుగులు మాత్రమే చేశాడు. 27.60 యావరేజ్ 170.37 స్ట్రైక్‌రేట్‌తో 138 పరుగులే చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. అతను మాత్రం రూ. 8.20 లక్షలకు ఒక్క పరుగు అన్నట్లు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇషాన్ కిషన్‌ను నమ్మిన కావ్యపాపను అతను నట్టేట ముంచేసాడని, అతని కెరీర్‌ను కూడా ప్రమాదంలో పడేసుకున్నాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్లే ఆఫ్స్ ఛాన్స్ సంక్లిష్టం..
సగం సీజన్ ముగిసే సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్‌లు ఆడి 5 పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇంకా 7 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఎలాంటి సమీకరణంతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరాలంటే సన్‌రైజర్స్ ఏడింటికి 7 గెలవాలి. అప్పుడే 9 విజయాలు 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది.

ఈ 7 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ ఓడినా.. ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్ నెట్ రన్‌రేట్ కూడా దారుణంగా ఉంది. కాబట్టి తదుపరి 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించడమే కాకుండా నెట్ రన్‌రేట్ కూడా మెరుగుపర్చుకోవాలి. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తోంది.

Story first published: Friday, April 18, 2025, 10:54 [IST]
Other articles published on Apr 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+