Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదేందయ్యా ఇషాన్ కిషన్.. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా! (వీడియో)

టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. తమిళనాడు వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో జార్ఖండ్‌కు సారథ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్.. హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్‌గా అవతారమెత్తాడు. రెండో రోజు ఆటలో రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బ్యాటర్ టీ రవి తేజకు రౌండ్ ద వికెట్ నుంచి రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు.

మొత్తం రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్‌ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇషాన్ కిషన్ బౌలింగ్ చేయడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 'ఇదేందయ్యా ఇషాన్ కిషన్.. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా?'అని కామెంట్ చేస్తున్నారు.

Ishan Kishan bowls off-spin against Hyderabad in Buchi Babu Tournament Video Goes Viral

ఇషాన్ కిషన్‌ బౌలింగ్ చేసినా.. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ విజయం సాధించలేకపోయింది. 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 1, 5 పరుగులు మాత్రమే చేశాడు.

టీమిండియా తరఫున కానీ, ఐపీఎల్‌లో కానీ ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు బౌలింగ్ చేయలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం అతను ఇప్పటి వరకు 5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 30 బంతుల్లో 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడంపై ఫోకస్ పెట్టిన ఇషాన్ కిషన్.. అందుకోసమే దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు.

గతంలో దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసి.. సెంట్రల్ కాంట్రాక్ట్‌తో పాటు టీమిండియాలో చోటు కోల్పోయాడు. చివరకు దేశవాళీ క్రికెట్‌తోనే రీఎంట్రీ ఇవ్వగలమని గ్రహించి.. బుచ్చి బాబు టోర్నీ ఆడుతున్నాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 114 బంతుల్లో 107 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 41 పరుగులు చేశాడు. దూకుడైన బ్యాటింగ్‌తో సిక్సర్ల మోత మోగించాడు. ఇషాన్ కిషన్ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 10 సిక్స్‌లు బాదాడు.

Story first published: Friday, August 23, 2024, 16:47 [IST]
Other articles published on Aug 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+