Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ishan Kishan: అతని వల్లే ఈ విజయం.. మాటలు రావడం లేదు

అభిషేక్ శర్మ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతోనే విజయం సాధించామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అన్నాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్ గురించి చెప్పేందుకు తనకు మాటలు రావడం లేదన్నాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 47 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అభిషేక్ శర్మ(68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 135 నాటౌట్) అజేయ శతకంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

నోట మాట రావట్లేదండి

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇషాన్ కిషన్.. అభిషేక్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా అతనికే దక్కుతుందన్నాడు. 'నేనేం చెప్పగలను..? అభిషేక్ విధ్వంసం.. క్లాసెస్ ఫినిష్ చేసిన విధానం చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. ముఖ్యంగా బంతి పాతబడే కొద్దీ షాట్లు ఆడటం కష్టమైంది. అలాంటి వికెట్‌పై 230+ పరుగులు చేస్తే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు.

Ishan Kishan Applauds Abhishek Sharma s Brilliance on a Slow Pitch After Thumping Win Over DC
Photo Credit: screen grab for JioHotstar

కొత్తగా వచ్చే బ్యాటర్లకు హిట్టింగ్ చేయడం అంత సులువు కాదు. అందుకే ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా అభిషేక్‌ శర్మకే దక్కుతుంది. మేం ఒక్కో మ్యాచ్‌పైనే ఫోకస్ పెడతాము. మా జట్టులో ప్రతి ఒక్కరూ బంతిని బలంగా బాదడానికి ఇష్టపడతారు. మేం 2-3 బంతులాడే వికెట్‌ కండిషన్స్‌ను పసిగట్టేస్తాం. బౌన్స్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకుంటాం. ఆపై మా సహజ సిద్ధమైన ఆటతో చెలరేగుతాం. మేం మరీ ఎక్కువగా ఆలోచించం. మా బ్యాటింగ్ వెనుక పెద్ద ప్లాన్ ఏం ఉండదు. బంతిని చూసి బాదడమే మా పని.

అందుకే హర్ష్‌దూబేకు ఆఖరి ఓవర్

కావలసిన రన్ రేట్, బంతుల మధ్య వ్యత్యాసం సాధ్యమైనంత ఎక్కువగా ఉండాలని నేను కోరుకున్నా. ఇలాంటి వికెట్లపై షాట్స్ ఆడటం అంత సులువు కాదు. హర్ష్ దూబే గురించి నాకు బాగా తెలుసు. ఎప్పుడు బౌలింగ్ ఇచ్చినా అతను మంచి బంతులు వేయగలడు. అతను చాలా తెలివైన బౌలర్.

"నువ్వు అత్యంత కీలకమైన ఓవర్లు వేయబోతున్నావు" అని నేను అతనితో ముందే చెప్పాను. ప్రత్యర్థి జట్టులో ఇద్దరు అత్యుత్తమ బ్యాటర్లు క్రీజులో ఉన్నప్పుడు మన బెస్ట్ బౌలర్లను రంగంలోకి దించడమే మా ప్లాన్. అది మాకు బాగా పని చేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో నేను ఎక్కువగా మాట్లాడను. కేవలం ఆటను ఆస్వాదించండి అని మాత్రమే చెబుతుంటాను.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.

అభిషేక్ ఊచకోత..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 242 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 135 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), హెన్రీచ్ క్లాసెన్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులే చేసి ఓటమిపాలైంది. నితీష్ రాణా(30 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 37), సమీర్ రిజ్వీ(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఎషాన్ మలింగా నాలుగు వికెట్లు తీయగా.. హర్ష్‌ దూబే(3/12) మూడు వికెట్లు పడగొట్టాడు. దిల్షాన్ మదుషంక, సకీబ్ హుస్సేన్ తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, April 22, 2026, 1:02 [IST]
Other articles published on Apr 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+