IND vs ZIM: ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఊచకోత..!
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81), తిలక్ వర్మ(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోర్ చేసింది.
వైభవ్ సూర్యవంశీ(9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20) మెరుపులు మెరిపించగా.. శ్రేయస్ అయ్యర్(20 బంతుల్లో 4 ఫోర్లతో 25) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, రిచర్డ్ నగర్వ, బ్రాడ్ ఇవాన్స్, న్యూమాన్ న్యామురి, బ్రియాన్ బెన్నెట్ తలో వికెట్ తీసారు.

నిరాశపర్చిన అభిషేక్ శర్మ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. మరోసారి అభిషేక్ శర్మ(8) తీవ్రంగా నిరాశపర్చాడు. రెండో ఓవర్‌లో ముజర్బానీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అభిషేక్ ఔటైనా.. వైభవ్ సూర్యవంశీ చెలరేగాడు. రిచర్డ్ నగర్వా వేసిన మూడో ఓవర్‌లో వరుసగా 4, 6, 4, 4 బౌండరీలు బాది ఆఖరి బంతికి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్లకు 53 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ విధ్వంసం..
ఓపికగా బ్యాటింగ్ చేసిన ఈ ద్వయం వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలిచింది. ఇషాన్ కిషన్ సైతం క్రీజులో సెట్ అయ్యేందుక కాస్త సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత తనదైన శైలిలో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 66 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని బ్రియాన్ బెన్నెట్ విడదీసాడు. శ్రేయస్ అయ్యర్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి తిలక్ వర్మ రాగా.. ఇషాన్ కిషన్ భారీ షాట్లతో చెలరేగాడు.
ఈ క్రమంలో ఇషాన్ కిషన్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తిలక్ వర్మ కూడా భారీ షాట్స్ ఆడటంతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగెత్తింది. 23 బంతుల్లో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. సెంచరీ దిశగా సాగిన ఇషాన్ కిషన్‌ను న్యూమాన్ న్యమురి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 94 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన రింకూ సింగ్(12) తీవ్రంగా నిరాశపర్చగా.. శివమ్ దూబే(6 నాటౌట్)తో కలిసి తిలక్ వర్మ భారత్ స్కోర్‌ను 219కి చేర్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications