Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ బ్రోమాన్స్.. తాగిన మత్తులో..! (వీడియో)

టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన 25వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నాడు. సెప్టెంబర్ 8(ఆదివారం)తో 25వ ఏట అడుగుపెట్టిన గిల్.. బెంగళూరులో తన సహచర ఆటగాళ్లతో సెలెబ్రేట్ చేసుకున్నాడు. దులీప్ ట్రోఫీ 2024 కోసం బెంగళూరులో ఉన్న శుభ్‌మన్ గిల్.. ఇండియా ఏ జట్టుకు సారథ్యం వహించాడు. అయితే ఇండియా బీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా ఏ ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్ ఓడినా.. ఆదివారం రాత్రి తన జట్టు సహచర ఆటగాళ్లతో బర్త్‌డే వేడుకలు జరుపుకున్నాడు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌తో పాటు కేఎల్ రాహుల్‌, ఇతర దేశవాళీ స్టార్స్ ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో భాగమయ్యారు.

Ishan Kishan and Shubman Gill s Bromance in Birthday Party Goes Viral

ప్రస్తుతం ఈ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫుల్‌గా తాగిన ఆటగాళ్లు మత్తులో డీజే సాంగ్స్‌కు చిందేసారు. సింగర్స్‌గా అవతారమెత్తారు. మైక్ చేతుల్లోకి తీసుకోని తమ హిడెన్ టాలెంట్‌ను బయటపెట్టారు. శుభ్‌మన్ గిల్ అయితే సింగర్‌గా అవతారమెత్తి తన స్నేహితులను అలరించారు. ఇషాన్ కిషన్.. శుభ్‌మన్ గిల్ పాటకు చిందేసాడు.

శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ బ్రోమాన్స్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. తాగిన మత్తులో ఇద్దరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని, ఈ ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందని సెటైర్లు పేల్చుతున్నారు. తొడ కండరాల గాయంతో ఇషాన్ కిషన్.. దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్ ఆడలేదు. బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులోనూ ఇషాన్ కిషన్‌కు చోటు దక్కలేదు.

కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ మాత్రం తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. దాంతో ఈ ఇద్దరూ దులీప్ ట్రోఫీ 2024 రెండో రౌండ్ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. సెప్టెంబర్ 12న చెన్నై వేదికగా బీసీసీఐ నిర్వహించే ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొననున్నారు. తొలి టెస్ట్‌కు మాత్రం భారత సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లంతా రీఎంట్రీ ఇచ్చారు. ఆకాశ్ దీప్, యశ్ దయాల్ కొత్తగా జట్టులోకి వచ్చారు.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్‌.

Story first published: Tuesday, September 10, 2024, 13:21 [IST]
Other articles published on Sep 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+