IND vs AFG: ఒకే ఓవర్‌లో రెండు శతకాలు..!
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, మిడిలార్డర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ శతకాలతో చెలరేగారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో లక్నో వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కారు. ఒకే ఓవర్‌లో ఈ ఇద్దరూ సెంచరీ మార్క్ అందుకున్నారు.
అఫ్గాన్ బౌలర్ బిలాల్ సమీ వేసిన 33వ ఓవర్ తొలి బంతిని బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ బాదిన శుభ్‌మన్ గిల్ వన్డేల్లో 9వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్ చివరి మూడు బంతులను వరుసగా బౌండరీలు బాదిన ఇషాన్ కిషన్ 71 బంతుల్లో రెండో వన్డే సెంచరీ సాధించాడు. 52 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.. మరో 19 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ ఇద్దరి విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో భారత్ 36 ఓవర్లలోనే 300 పరుగుల మార్క్ అందుకొని భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్(4) తీవ్రంగా నిరాశపర్చాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. తమదైన శైలిలో బ్యాటింగ్ చేసిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. అయితే హాఫ్ సెంచరీ ముంగిట రోహిత్ శర్మ(48)ను రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు నమోదైన 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి ఇషాన్ కిషన్ రాగా.. శుభ్‌మన్ గిల్ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్న ఇషాన్ కిషన్.. హాఫ్ సెంచరీ అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications