Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Isa Guha: ‘నీది ఎంత పెద్దగుంది’.. లేడీ కామెంటేటర్ డబుల్ మీనింగ్ క్వశ్చన్! నవ్వులే నవ్వులు(వీడియో)

Isa Guha Asks How Big Is Yours Double Meaning Question To Gilchrist Leaves Commentators On Shock

సిడ్నీ: ఆస్ట్రేలియా‌కు చెందిన ప్రతిష్టాత్మక టీ20 లీగ్ బిగ్‌బాష్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ మహిళా కామెంటేటర్ ఇసా గుహా అడిగిన ఓ డబుల్ మీనింగ్ క్వశ్చన్.. నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ ధనాధన్ టోర్నీలో ఓ లీగ్ మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ బాక్స్‌లో క్యారమ్ బాల్స్‌ గురించి సీరియస్‌గా చర్చ జరుగుతుండగా.. ఇసా గుహా అడిగిన డబుల్ మీనింగ్ క్వశ్చన్‌తో అక్కడ నవ్వులు పూసాయి. ఇక ఆమె అడిగిన ప్రశ్నకు షాక్ అయిన సహచర కామెంటేటర్లు ఆడమ్ గిల్ క్రిస్ట్‌తో పాటు మరొకరు నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం(డిసెంబర్‌ 12న) మెల్‌బోర్న్‌ స్టార్స్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ సీరియస్‌గా జరుగుతుండగా.. కామెంట్రీ బాక్స్‌లో స్పిన్ బౌలింగ్‌లోని క్యారమ్ బాల్స్ గురించి చర్చ జరిగింది. ఓ కామెంటేటర్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. తమ హెడ్ కోచ్‌.. క్యారమ్ బాల్ వేయాలంటే మిడిల్ ఫింగర్ పోడుగ్గా ఉండాలనేవాడని, ఎవరిది పెద్దగా ఉంటే వారు సమర్థవంతంగా క్యారమ్ బాల్ వేయగలరని చెప్పేవారని గుర్తు చేసుకున్నాడు. ఈ వ్యాఖ్యలు విన్న వెంటనే ఇసా గుహా 'మీది ఎంత పెద్దది?'అని ప్రశ్నించింది. ఆమె అతని మిడిల్ ఫింగర్ గురించి అడిగినప్పటికీ.. డబుల్ మీనింగ్‌గా తీసుకున్న సహచర కామెంటేటర్లు నవ్వు ఆపుకోలేకపోయారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ సైతం పడిపడి నవ్వాడు.

ఇంగ్లండ్ మహిళా ప్లేయర్ అలెక్స్ హార్ట్‌లీ 'రీజనబుల్ క్వశ్చన్'అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేయగా.. ఇసా గుహా వివరణ ఇచ్చింది. క్యారమ్ బాల్‌ను ఉద్దేశించి మాట్లాడిందే అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 6 వికెట్ల తేడాతో విజయాన్నందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ థండర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

మరోవైపు బిగ్ బాష్ లీగ్ రసవత్తరంగా సాగుతుంది. డిఫెండింగ్ చాంపియన్స్ సిడ్నీ సిక్సర్స్, పెర్త్ స్కార్చర్స్, మెల్‌బోర్న్ స్టార్స్ శుభారంభాలు అందుకోని జైత్రయాత్రలు కొనసాగిస్తున్నాయి. సిడ్నీ సిక్సర్స్ ఇప్పటికే మూడు టైటిళ్లు గెలవగా.. నాలుగో టైటిల్‌పై కన్నేసింది. మెల్‌బోర్న్ రెనిగెడ్స్, సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ శుభారంభాలు అందుకోలేకపోయాయి. మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కోదాంట్లోనే గెలిచింది. 8 జట్లలో నుంచి ఐదు టీమ్స్ తదుపరి దశకు చేరుతాయి.

Story first published: Tuesday, December 14, 2021, 17:56 [IST]
Other articles published on Dec 14, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+