For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రాపై ఆ పదం వాడినందుకు క్షమించండి: ఇసా గుహ (వీడియో)

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు అతని అభిమానులకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇసా గుహ క్షమాపణలు చెప్పింది. దురుద్దేశంతో తాను ఆ పదాన్ని ఉపయోగించలేదని స్పష్టం చేసింది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో బుమ్రా ఐదు వికెట్ల ఘనతను అందుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే బుమ్రాను కొనియాడుతూ.. ఇసా గుహ 'మోస్ట్ వాల్యుబుల్ ప్రిమేట్'అనే పదాన్ని ఉపయోగించింది. ప్రిమేట్ అనేది చింపాజీ క్యారెక్టర్‌తో తీసిన ఆంగ్ల హాస్య చిత్రం పేరు. దాంతో బుమ్రాను ఇసా గుహ చింపాంజీతో పోల్చిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Isa Guha Apologises Over Primate Remark On Jasprit Bumrah

తన తప్పును తెలుసుకున్న ఇసా గుహ.. మూడో రోజు ఆట ఆరంభంలోనే బుమ్రాతో పాటు అతని అభిమానులకు క్షమాపణలు తెలియజేసింది. 'రెండో రోజు ఆటలో కామెంట్రీ చేస్తూ ఓ పదం ఉపయోగించాను. కానీ, అది విపరీత అర్థాలకు దారి తీసింది. ఆ పదం ఉపయోగించడం వల్ల ఎవరైన బాధపడితే క్షమించండి. ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా నేను ఎప్పుడూ మాట్లాడను.

నా మాటలు పూర్తిగా వింటే.. బుమ్రాను కొనియాడినట్లు మీకు అర్థమవుతోంది. టీమిండియా ఆటగాళ్లను నేను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడను. క్రికెట్ కోసం పాటుపడే వారికి కోసం అండగా ఉంటాను. బుమ్రా విషయంలోనూ అతడు సాధించిన ఘనతలను కొనియాడే క్రమంలో తప్పుడు పదం వాడాను. అందుకు మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నా.

సౌత్ ఆసియా వారసత్వం కలిగిన నేను ఎలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదని అక్కడి వాళ్లు భావిస్తారని అని ఆశిస్తున్నా. అసాధారణమైన టెస్ట్‌ మ్యాచ్‌కు ఇలాంటి వ్యాఖలు నష్టం చేయవు.'అని ఇసా గుహ పేర్కొంది.

లైవ్ టెలికాస్ట్‌లో క్షమాపణలు చెప్పిన ఇసా గుహను టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కొనియాడాడు. పొరపాట్లు చేయడం సహజమని, ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్‌లో కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయని, వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగాలని సూచించాడు.

Story first published: Monday, December 16, 2024, 12:22 [IST]
Other articles published on Dec 16, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+